పనిఒత్తిడితో మహిళలకు ఈ ప్రాణాంతక సమస్యలు



స్విట్జర్లాండ్లోని శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం పురుషుల కంటే మహిళల్లో ఒత్తిడి వేగంగా పెరుగుతుంది.



వీరిలో గుండెపోటు, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు అధికంగా ఉంటాయి.



ఇంట్లోని బాధ్యతలు, పిల్లల బాధ్యతలు చూస్తూనే ఉద్యోగం చేయడం వల్లే మహిళల్లో ఎక్కువగా ఒత్తిడి కలుగుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.



పని ఒత్తిడి అధికంగా ఉన్నట్టు 2017లో 66% మంది, 2012లో 59 శాతం మంది చెప్పారు.



అలాగే 2012లో పని ఒత్తిడి అధికంగా ఉన్నట్టు 38% మంది మహిళలు చెప్పగా, 2017లో 44% అధికంగా ఉన్నట్టు చెప్పారు.



పురుషులు కేవలం ఐదు శాతం మందే ఒత్తిడి కారణంగా నిద్రపోలేకపోతున్నామని వివరించారు. మహిళలు మాత్రం ఎనిమిది శాతం మంది ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు.



అధిక రక్తపోటు, నిద్రలేమి, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం వంటి సమస్యలు ఒత్తిడి వల్ల మహిళల్లో వస్తాయి.