మామిడి పండు తిన్నాక నీళ్లు తాగకూడదా?



పండ్లలో రారాజుగా పేరు తెచ్చుకుంది మామిడి పండు. రుచిలోనే కాదు, ఆరోగ్యం అందించే విషయంలో కూడా ఇది మేటి.



మామిడిపండును తిన్నాక కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. వీటిని తినడం వల్ల కొంతమందిలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



కొంతమందికి మామిడిపండు తిన్న తర్వాత నీరు తాగితే విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువ. పండు తిన్నాక ఒక గంట వరకు నీరు తాగకూడదు.



ఈ పండు తిన్నాక కూల్ డ్రింకులు, సోడా దూరం పెట్టాలి.



స్పైసీ ఫుడ్ ను తిన్నాక మామిడిపండును తింటే జీర్ణ క్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.



ఈ పండు తిన్నాక కాకరకాయ వంటకాలను తినకూడదు. కొందరిలో వాంతులు, వికారం వచ్చే ఛాన్సు ఉంది.



పెరుగులో మామిడి ముక్కలు వేసి తినే అలవాటు ఉంటే మానుకోండి. ఈ ఆహార కలయిక ఆరోగ్యానికి చాలా హానికరం.



ఈ జాగ్రత్తలు తీసుకుని తింటే మామిడి పండ్లు అనేక పోషకాలను శరీరానికి అందిస్తుంది.