అదనపు కొవ్వు కరిగించడంలో సహాయపడే అద్భుతమైనవి సోంపు గింజలు.

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాల గొప్ప మూలం సోంపు గింజలు. పోషకాల పవర్ హౌస్ గా పిలుస్తారు.

ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉంచి అతిగా తినాలనే కోరికని తగ్గిస్తుంది.

ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలు వేసుకుని రాత్రంతా నానబెట్టాలి.

పొద్దున్నే పరగడుపున టీ లేదా కాఫీ తాగే బదులు ఈ సోంపు వాటర్ తాగొచ్చు

యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకి పంపుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.

వేడి నీటిలో ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసుకోవాలి. వాటిని బాగా మరిగించాలి.

రుచి కోసం పుదీనా ఆకులు, అల్లం వేసుకోవచ్చు. రుచి ఘాటుగా అనిపిస్తే అందులో కాస్త తేనె కలుపుకుని టీ తాగొచ్చు.

ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సోంపు తీసుకుంటే ఫిట్ నెస్ కు చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది.

Images Credit: Pixabay/ Pexels/ Unsplash