రోజీ బుగ్గలు తాజా యవ్వన రూపానికి సంకేతం. ఎర్రటి యాపిల్ పండులా బుగ్గలు కనిపిస్తూ ఉంటే మీ అందం మరింత రెట్టింపు అవుతుంది. బుగ్గలు ఎర్రగా కనిపించడం కోసం మేకప్ వేసుకుంటారు. సహజంగానే రోజీ బుగ్గలు పొందాలంటే ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. శరీర పనితీరు మెరుగుపడుతుంది. చేతి వేళ్ళతో బుగ్గలను సున్నితంగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎర్రగా నిగనిగలాడుతూ కనిపిస్తాయి. రోజ్ వాటర్, తేనె, పెరుగు వంటి సహజ పదార్థాలతో తయారు చేసిన ఫేషియల్ మాస్క్ అప్లై చేయడం వల్ల చర్మానికి కావాల్సిన పోషణ అందుతుంది. ఎంత బాగా నీళ్ళు తాగితే అంత అందంగా కనిపిస్తారు. హైడ్రేట్ గా ఉండటం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. గోరు వెచ్చని నీటితో ముఖానికి ఆవిరి పట్టించడం వల్ల చర్మం మీద రంధ్రాలు తెరుచుకుంటాయి. రోజీ బుగ్గలను ఇస్తుంది. సన్ స్క్రీన్ సూర్యుడి హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడం వల్ల చర్మం దెబ్బతినకుండా నిరోధించవచ్చు. తగినంత నిద్ర ఎప్పుడూ ఆరోగ్యాన్ని ఇస్తుంది. కంటి నిండా నిద్రపోవడం వల్ల మొహం ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక్కొక్కరి చర్మం ఒక్కో విధంగా ఉంటుంది. ప్రతిదీ అందరికీ సెట్ అవదు. హోమ్ ప్యాక్ వేసుకునే ముందు చెక్ చేసుకోవాలి