గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా? గర్భం ధరించాక తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. పూర్వం నుంచి ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. గర్భం ధరించాక నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అయ్యే అవకాశం ఉందని అంటారు. కుటుంబంలోని పెద్దలు గర్భవతిగా ఉన్న స్త్రీని నెయ్యి తినమని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గర్భం చివరి నెలల్లో నెయ్యి తినడం వల్ల సాధారణ ప్రసవం అవుతుందని ఎక్కడా శాస్త్రీయంగా రుజువు కాలేదు. పెద్దలు భావిస్తున్న ప్రకారం నెయ్యి తినడం వల్ల డెలివరీ సమయంలో సాధారణ పద్ధతిలో బిడ్డ సులభంగా బయటికి జారిపోవడానికి సహాయపడుతుందని అంటారు. శతాబ్ధాలుగా సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో నెయ్యిని ఉపయోగిస్తున్నారు. నెయ్యిలో విటమిన్లు ఏ, డి, ఈ, కే ఉన్నాయి. ఇది గర్భధారణ సమయంలో పిండానికి మేలు చేస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. గర్భస్థ శిశువు మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇవి తోడ్పడుతాయి.