అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నన్ తల మీద రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. చియా గింజల్లో జింక్, కాపర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. జుట్టుకి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. నువ్వులు జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాదు తెల్ల జుట్టు రానీయదు. పిస్తా పప్పులోని బయోటిన్ జుట్టు మృదువుగా ఉంచుతుంది. ఇందులోని ఐరన్ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. బాదం జ్ఞాపకశక్తికి సహాయపడటమే కాకుండా వాటిలోని విటమిన్ ఇ కంటెంట్ జుట్టును పెరిగేలా చేస్తుంది. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గుమ్మడి గింజల్లో సెలీనియం, జింక్, కాపర్, మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. జుట్టు రాలడాన్ని చేసే టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిస్తుంది. కొబ్బరిలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జుట్టునిస్తుంది. Images Credit: Pexels