డయాబెటిస్ రోగుల కోసం తియ్యటి పాయసం



పాలు - రెండు కప్పులు
కుంకుమ పువ్వు - అయిదు రేకులు
ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలు - 3 టీస్పూన్లు
బియ్యం - పావు కప్పు
పిస్తాలు - నాలుగు
యాలకుల పొడి - అర స్పూను



పాలు ముందుగా మరిగించి పక్కన పెట్టుకోవాలి. బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి.



బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. చిన్న గిన్నెలో పాలు వేసి, కుంకుమ పూలను నానబెట్టాలి.



మరిగించిన పాలను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి.



చిన్న మంటపై ఉడికించాలి. అందులో బియ్యం పేస్టును వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి.



ఆర్టిఫిషియల్ చక్కెర గుళికలను మెత్తటి పేస్టులా చేసి వాటిని వేసి కలపాలి. చిక్కని పాయసంలా అయ్యాక స్టవ్ కట్టేయాలి.



పిస్తా పప్పును తరిగి పైన చల్లుకోవాలి.