చర్మానికి హాని కలిగించే UV కిరణాల నుంచి రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే ఈ ఎండకి మరింత జిడ్డుగా మారుతుందని, చర్మం కూడా నల్లగా అయిపోతుందని అనుకుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఒక్కోసారి అవి చర్మ క్యాన్సర్ కి కారణం కావచ్చు. వీటి నుంచి బయట పడాలంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలు నివారించవచ్చు. జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ వంటి సున్నితమైన రసాయనాలు కలిగి ఉన్న సన్ స్క్రీన్ ని ఉపయోగించాలి. టానింగ్ నుంచి రక్షణగా నిలుస్తుంది. సున్నితమైన చర్మం అయితే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్ స్క్రీన్ రాసుకోవాలి. SPF 30 ఉన్న సన్ స్క్రీన్ రాసుకుంటే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి అవసరమైన చర్మ ప్రోటీన్లు సన్ స్క్రీన్ ద్వారా రక్షించబడతాయి. చర్మానికి ఎటువంటి రక్షణ లేకపోతే సూర్యరశ్మి నుంచి వచ్చే కిరణాల వల్ల ఎలాస్టిన్, కొల్లాజెన్, చర్మ కణాలకు హాని కలుగుతుంది. Images Credit: Pexels