మిగిలిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలంటే...



తిన్నాక మిగిలిన ఆహారాన్ని దాచుకొని మళ్ళీ తింటూ ఉంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే.



ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో ఆయుర్వేదం వివరిస్తోంది.



మిగిలిపోయిన ఆహారాన్ని అయితే 24 గంటల్లోపు తినాలి. 24 గంటల తరువాత నిల్వ ఉన్న ఆహారాన్ని తింటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి.



అంతేకాదు అలాంటి ఆహారంలో బ్యాక్టిరియా అభివృద్ధి చెందడం మొదలైపోతుంది. ఈ మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసినా కూడా ఆ బ్యాక్టిరియా పోయే అవకాశం లేదు.



ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది.



దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు రోగాలు వచ్చే అవకాశం ఉంది.



ఇక తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తినేయాలి.



తాజా ఆహారం ప్రాణాన్ని పోషిస్తుందని. జఠరాగ్నిని అంటే జీర్ణంలోని వేడిని పెంచుతుందని నమ్ముతారు.