మరణానికి ముందు ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా కోల్పోతూ... మరణం సమీపిస్తున్నప్పుడు అతనికి ఎలాంటి భావాలు కలుగుతాయి? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో వివరిస్తున్నారు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. మరణం దగ్గర పడుతున్న కొద్దీ వారు ఒక్కొక్కటిగా శరీరంలోని అవయవాల పనితీరును కోల్పోతూ ఉంటారు. ముందుగా వారు ఆకలిని కోల్పోతారని, తర్వాత దాహాన్ని కోల్పోతారని చెబుతున్నారు పరిశోధకులు. తరువాత పంచేంద్రియాలలో ఒకటైన వినికిడి శక్తిని కోల్పోతారు. తరువాత స్పర్శను కోల్పోతారు. చివరిగా మరణిస్తారు. గుండెపోటు నుండి బయటపడిన వారిని పరిశోధకులు పలు ప్రశ్నలు వేసి వివరాలను సేకరించారు. గుండె పోటు రావడం అంటే మరణం అంచుల దాకా వెళ్లి రావడమే. ఆ సమయంలో వారికి తమ తలపై తెల్లటి కాంతిని చూసినట్లు చెప్పారు. కోమాలోకి వెళుతున్నప్పుడు రోగులు తమకు తుఫాను వచ్చినట్టుగా అనిపించిందని, అలలు అంతెత్తుకు ఎగిసిపడుతున్నట్టు అనిపించాయని వివరించారు. చనిపోయే ముందు కూడా తెల్లటి కాంతి కనిపించడం ఎంతో మందికి అనుభవంలోకి వస్తుందని వివరిస్తున్నారు నిపుణులు.