వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్స్ జాబితాలో పుచ్చకాయ ముందుంటుంది. సమ్మర్ సీజన్ లో దొరికే పోషకాల పండు. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. జ్యూసీ, క్రంచీ ఫ్రూట్ లో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. మధుమేహులు కూడా పుచ్చకాయ తినొచ్చు. షుగర్ లెవల్స్ పెరుగుతాయనే భయం అక్కర్లేదు. గర్భిణీలు రోజూ పుచ్చకాయ తీసుకుంటే చాలా మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది. ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. పుచ్చకాయ గుండెకు మంచిది. ఇందులోని లైకోపీన్ కొలెస్ట్రాల్ ని తగ్గించడానికి, రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజేనరేషన్ వ్యాధిని నిరోధించడంలో సహాయపడుతుంది. చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. పళ్ల మీద ఫలకం ఏర్పడకుండా నెమ్మదించేలా చేస్తుంది. దంతాలు తెల్లగా మార్చేందుకు, పెదవులు పొడిబారిపోకుండా పగిలిపోకుండా నిరోధిస్తుంది. అల్పాహారం లేదా భోజనం మధ్యలో దీన్ని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. సాయంత్రం వేళ కూడా తినొచ్చు కానీ రాత్రి పూట మాత్రం తినొద్దు. ఎందుకంటే ఇది పొట్టను కలవరపెడుతుంది.