గసగసాలలో విటమిన్ బి, ఫోలేట్, ధయామిన ఉంటుంది. ఆరోగ్యానికి మేలు చేయాలంటే నానబెట్టిన తర్వాత తినాలి. బియ్యం 15-30 నిమిషాలు నానబెట్టడం వల్ల ఇందులోని పిండి పదార్థం తగ్గిపోతుంది. రాజ్మాను రాత్రంతా నానబెట్టడం వల్ల ఉబ్బరం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. చోలే నానబెట్టి వండితే అజీర్ణం ప్రమాదం తగ్గిస్తుంది. నానబెట్టిన బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉంటుంది. మామిడిపండ్లలో ఉత్పత్తి అయ్యే అదనపు ఫైటిక్ ఆమ్లం తొలగించడానికి నీళ్లలో నానబెట్టాలి. నీటిలో నానడం వల్ల ఈ అదనపు వేడి కూడా తగ్గిపోతుంది. ఎండుద్రాక్ష నానబెట్టి తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఐరన్ లోపంతో ఉన్న మహిళలకు మంచిది. Images Credit: Pexels