స్లీప్ వాకింగ్‌లో ఇలాంటి పనులు కూడా చేస్తారా? వినడానికి స్లీప్ వాకింగ్ చిన్న సమస్యగానే కనిపించవచ్చు, కానీ అది ఆరోగ్యాన్ని వేధించే సమస్య. దీని బారిన పడినవారు కేవలం నిద్రలో నడవడం మాత్రమే చేస్తారని అనుకుంటారు అంతా. కానీ వారు చేసే పనులు చాలా ఉంటాయి. అర్ధరాత్రి లేచి నడుస్తూ దుస్తులు ధరించడం, ఆహారాన్ని తినడం, గిన్నెలు తోమడం,ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది స్లీప్ వాకింగ్‌లోనే ఉన్నప్పుడే సెక్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి పనుల్నీ చేశాక తాపీగా పోయి మళ్లీ మంచం మీద నిద్రపోతారు. నిద్ర నుంచి లేచాక చేసిన పనులేవీ గుర్తుకు రావు. మెలకువ వచ్చాక ఇలా నువ్వు చేసావని చెప్పినా కూడా వారు నమ్మరు. స్లీప్ వాకింగ్‌ను తక్కువ అంచనా వేయకూడదు. దీనికి కచ్చితంగా చికిత్స తీసుకోవాలి.