గర్భసంచిలో గడ్డలు ఎందుకు ఏర్పడతాయి?



మాతృత్వానికి అడ్డుపడుతున్న సమస్యల్లో గర్భసంచిలో గడ్డలు రావడం కూడా ఒకటి.



గర్భసంచిలో గడ్డలు ఎందుకు వస్తాయో చెబుతున్నారు వైద్యులు.



వైద్యులు వివరిస్తున్న ప్రకారం గర్భసంచిలో గడ్డలు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంది.



అలాగే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల కారణంగా ఇలా గడ్డలు పెరుగుతాయి.



శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు గర్భసంచిలో ఉండే ఫైబ్రాయిడ్ ల పరిమాణం పెరిగిపోతుంది. అవే గడ్డలుగా మారతాయి.



ఈ గడ్డలు గర్భాశయం లోపల ద్వారం దగ్గర, గోడల పొరలకు అతుక్కుని ఎక్కడైనా ఏర్పడవచ్చు. అందుకే ఇవి ఉన్నచోట పిండం తయారు కాదు. గర్భం ధరించలేరు.



స్కానింగ్లో వీటి పరిమాణం బయటపడుతుంది. ఇవి వేరుసెనగ గింజల పరిమాణం నుంచి పుచ్చకాయ సైజు వరకు పెరుగుతాయి.



పిల్లలు లేని వారికి ఈ గడ్డలు వస్తే వాటిని కరిగించి లేదా తొలగించడం ద్వారా సంతానం కలిగేలా చేస్తారు.
(All Images Credit: Pixabay)