పాలల్లో నీళ్లు కలిపితే ఇలా కనిపెట్టేయచ్చు



ఆహారపదార్థాలు కల్తీ చేయడం వల్ల ఒక్కోసారి అది తీవ్ర అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.



పదార్థం కల్తీదో, స్వచ్ఛమైనదో తెలుసుకోవడం కోసం పరీక్ష చేయమని చెబుతుంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.



భారతదేశంలో సాధారణంగా కనిపించే కల్తీ చేసే ఆహారాల్లో ప్రధానమైనది పాలు. పాలల్లో నీళ్లు కలుపుతారు.



పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష చేయాలి.



సాదా గాజు లేదా స్టీలు ప్లేటును తీసుకోవాలి. ఒకవైపు కొంచెం ఎత్తుగా ఉండేటట్టు అంటే వాలుగా ఉండేలా పట్టుకోవాలి.



పెద్ద పాల చుక్కను ఆ ప్లేటుపై వేయాలి. ఆ పాలు జారకుండా ఉండిపోయినా, లేదా నెమ్మదిగా జారిన ఆ పాలు స్వచ్ఛమైనవి.



అలా కాకుండా చుక్క ఇలా వేయగానే వేగంగా కిందకు జారిపోయిందంటే అందులో నీళ్లు కలిపారని అర్థం.
(All Images Credit: Pixabay)