మష్రూమ్ పౌడర్ ఇలా చేయండి



పుట్టగొడుగుల రుచే కాదు, ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువే. కాకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పుట్టగొడుగులు లభించవు.



పుట్టగొడుగులను పౌడర్ రూపంలో దాచుకోవచ్చు. అలా దాచుకొని నచ్చినప్పుడు కూరల్లో భాగంగా కలుపుకోవచ్చు.



పోషకాలు నిండిన పుట్టగొడుగుల రకాలను ఎంచుకోవాలి. వాటిని నీటిలో వేసి కడగాలి.



టిష్యూలతో సున్నితంగా తుడిచేయాలి. మురికి, చెత్త, తడి లేకుండా తొలగించాలి. ఇప్పుడు ఆ పుట్టగొడుగులను సన్నగా, ముక్కలుగా కట్ చేసుకోవాలి.



బేకింగ్ షీట్లో వాటిని వేసి ఒవేన్ లో ఉంచాలి. ఓవెన్ను 150 నుంచి 200° డిగ్రీల వద్ద వేడి చేయాలి.



అవి పూర్తిగా పొడిగా, పెళుసుగా అయ్యేవరకు ఓవెన్లో వేడి చేయాలి. బాగా ఎండాక పుట్టగొడుగులను మిక్సీలో వేసి పొడిగా మార్చుకోవాలి.



గాలి చొరబడని కంటైనర్ లో వీటిని వేసి దాచుకోవాలి.



ఓవెన్ లేకపోతే ఇప్పుడు మండే ఎండలకు పుట్టగొడుగులు రెండు రోజుల్లోనే పెళుసుగా ఎండిపోతాయి. అలా ఎండబెట్టాక పొడిగా మార్చుకోవచ్చు.
(All Images Credit: Pexels)