పీనట్ బటర్ లో కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగాలనుకున్న వారికి మంచి ఎంపిక.

ప్రోటీన్లు, కాల్షియం పొందటానికి పాలు ఉత్తమ మార్గాలు.

బరువు తగ్గాలనుకునే వారికి గుడ్డులోని తెల్ల సొన ఉపయోగపడుతుంది. కానీ బరువు పెరగాలంటే పూర్తి గుడ్డు తినాలి.

బరువు పెరగాలంటే పాలు మాత్రమే కాదు పెరుగు తీసుకోవాలి. ఇందులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి.

చీజ్ లో ప్రోటీన్లు, కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన బరువు పెరగడంతో సహాయపడుతుంది.

ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, లీన్ ప్రోటీన్లతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే సాల్మన్ చేపలు బరువు పెంచుతాయి.

రెడ్ మీట్ వేగంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది.

తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వాళ్ళు బాదం బటర్ తీసుకుంటే మంచిది.