Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి
ప్రతి ఒక్కరికీ ఉదయం అల్పాహారం ఎంతో ముఖ్యం. రోజంతా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఉదయం తీసుకునే అల్పాహారం మీద ఆధారపడి ఉంటుంది. బరువును పెంచడం, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, జీవక్రియని ప్రభావితం చేస్తుంది.
ప్రతి ఒక్కరికీ ఉదయం అల్పాహారం ఎంతో ముఖ్యం. రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం తప్పకుండా అల్పాహారాన్ని తీసుకోవాలి. అల్పాహారం బరువును పెంచడం, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి, జీవక్రియని ప్రభావితం చేస్తుంది. అందుకే తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తారు. హృద్రోగ సమస్యలతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అయితే వాళ్ళు సరైన ఆహార పదార్థాలని ఎంచుకోవాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. సాధారణంగా చేసే అల్పాహారంలో సంతృప్త కొవ్వుల స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అది గుండెకి ఎంత మాత్రం మంచిది కాదు. అందుకే గుండె సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళు తమ అల్పాహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గుండెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే అల్పాహారం అంటే ఏం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తినాలి?
అసంతృప్త కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే విధమైన ఆహారపదార్థాలతో తయారు చేసిన అల్పాహారం గుండెకు చాలా మంచిది. తృణధాన్యాలతో చేసిన పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. నిపుణుల నివేదిక ప్రకారం.. హార్ట్ పేషంట్స్ అవకాడో టోస్ట్ ఎంపిక చేసుకోవడం బెస్ట్. మార్చి, 2022న ఓ అధ్యయనం ప్రకారం.. అవకాడోతో చేసిన పదార్థాలు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 16 శాతం తక్కువగా ఉందని తేలింది. మీడియం సైజ్ అవకాడోలో 96 కేలరీలు, 6 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 4 గ్రాముల ఫైబర్ లభిస్తాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఇవి బాగా సహాయపడతాయి. తద్వారా రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసి గుండె స్ట్రోక్స్ రాకుండా నివారిస్తుంది.
శరీరానికి ఫైబర్, కార్బోహైడ్రేట్ లని అందించడం కోసం అవకాడోతో తృణధాన్యాలు కూడా చేర్చవచ్చు. ఈ టోస్ట్ లో 7 గ్రాముల ఫైబర్ అందుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా చేసేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే వైద్యులు ఈ అల్పాహారాన్ని తీసుకోమని సిఫార్సు చేస్తారు. పోషక విలువలను మరింత పెంచుకోవడం కోసం ఇందులో బెర్రీలని కూడా చేర్చుకోవచ్చు.
అవకాడో టోస్ట్ కి కావాల్సిన పదార్థాలు
అవకాడో- ఒకటి
బ్రెడ్
ఆలివ్ ఆయిల్
ఉప్పు
మిరియాల పొడి- ½ టీ స్పూన్
నిమ్మకాయ- ఒకటి
తయారీ విధానం
బ్రెడ్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టుకుని ఆ బెడ్ ముక్కలని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి అవకాడో తీసుకుని దాన్ని మెత్తగా పేస్ట్ మాదిరిగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు, ½ టీ స్పూన్ నిమ్మరసం, ½ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ మీద ఆలివ్ ఆయిల్ రాసి దాని మీద ఆ మిశ్రమాన్ని రాసుకోవడమే.
Also Read: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
Also Read: తొలి అవయవదానం ఎప్పుడు జరిగిందో తెలుసా? అవయవదానంపై ఉన్న అపోహలు - వాస్తవాలు ఇవే