Duck Oil: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు
బాతు నూనె గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు తెలుసుకోండి.
నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేవి వేరు శెనగనూనె, పొద్దు తిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ గుర్తొస్తాయి. అలాగే చేప నూనె కూడా చాలా మందికి తెలుసు. అయితే చేప నూనెను సప్లిమెంట్ల ద్వారా కూడా తీసుకుంటారు. కానీ మీరెవ్వరూ బాతు నూనె గురించి విని ఉండరు. దీనిని బాతు నుంచే తయారుచేస్తారు. ఈ బాతు నూనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని మితంగా తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు కలుగుతాయి.
ఏంటిది?
బాతులోని పిట్యూటరీ గ్రంధి ఉత్పత్తి చేసే నూనె ఇది. దీన్ని డాగేస్తాన్లోని మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఓ జాతికి చెందిన మహిళలు బాతు మెడ నుంచి మసాజ్ పద్ధతిలో నూనెను బయటికి తీస్తారు. ఈ పని అందరూ చేయలేరు. డాగేస్తాన్ అనేది రష్యాకు దగ్గర్లో ఉండే చిన్న దేశం. ఇది చాలా ఖరీదు. ఆహారంలో ఈ నూనెను రోజుకు ఒకటి లేదా రెండు స్పూనులు కలుపుకుని తింటే చాలా మంచిది. కూరలు వండుకునేటప్పుడు వాటిలో కలుపుకుని తిన్నా మంచిదే. ఈ నూనెతో ఎన్న ఆరోగ్యం ప్రయోజనాలున్నాయి.
గుండెకు మంచిది
బాతు నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ అధికంగా లభిస్తుంది. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. గుండె పోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధ వ్యాధులను రాకుండా అడ్డుకుంటుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం
బాతు నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరరీంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. మీ ఆహారంలో బాతు నూనెను క్రమం తప్పకుండా కలిపి తినడం వల్ల ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తి
ఈ నూనె వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుంది. దీని వల్ల టాక్సిన్ల నుంచి రక్షణ దక్కుతుంది. ఈ నూనెలో జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
మంచి కొవ్వులు పుష్కలం
బాతు నూనె మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇతర జీవులతో పోలిస్తే ఆరోగ్యకరమైన కొవ్వులు దీనిలో ఉంటాయి. అందుకే గుండె సంబంధిత రోగాలు త్వరగా దాడిచేయవు. అలాగే గుండె సమస్యలతో బాధపడేవారికి ఈ నూనె చాలా మేలు చేస్తుంది.
కిడ్నీ ఆరోగ్యానికి
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడడంలో బాతు నూనె చాలా మేలు చేస్తుంది. ఈ బాతు నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, లినోలిక్ ఆమ్లం మీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఎముకలకు మేలు
ఎముకలను బలోపేతం చేయడంలో ఈ నూనె చక్కగా పనిచేస్తుంది. దీనిలో ఉండే లినోలిక్ ఆమ్లం కాల్షియం శోషణను పెంచుతుంది. దీని వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అందుకే కనీసం రోజుకో ఒక స్పూను బాతునూనైనా తింటే మంచిది.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది
బాతునూనె క్రమ పద్ధతిలో రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్న వారికి బాతు నూనె చాలా మేలు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
Also read: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?
Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.