అన్వేషించండి

Curd: ఆస్తమా ఉన్న వాళ్లు రాత్రి పూట పెరుగు తినవచ్చా? ఆయుర్వేదం ఏం చెబుతోంది?

పెరుగు ఆరోగ్యకరమైనదే కానీ, రాత్రిపూట తినవచ్చా లేదా అనే విషయంలోనే కాస్త సందేహం ఉంది చాలా మందిలో.

భారతీయ ఆహారంలో పెరుగుది ప్రత్యేక స్థానం. చివరలో పెరుగుతో అన్నం తిననిదే భోజనం పూర్తి కాదు తెలుగువారికి.  మధ్యాహ్నం అయినా, రాత్రయినా కూడా పెరుగుతో ముగించాల్సిందే. పెరుగు తిన్న వెంటనే శరీరానికి హాయిగా ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు సూపర్ ఫుడ్ అనే చెప్పాలి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. అయితే ఒక్కటే సందేహం? రాత్రిపూట పెరుగు తినవచ్చా?

ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే రాత్రిపూట పెరుగు తినకూడదు. కొన్ని సమయాల్లో తీసుకున్న ఆహారాలు శరీర పనితీరును దెబ్బతీస్తాయి. వాటిలో పెరుగు కూడా ఒకటి. పెరుగులో తీపి, పుల్లని రుచినిచ్చే గుణాలు ఉంటాయి. దాన్ని రాత్రిపూట తినడం వల్ల నాసికా మార్గంలో అధిక శ్లేష్మం ఏర్పడటానికి కారణం అవుతుంది. అలాగే మరెన్నో సమస్యలకు కారణం అవుతుంది. 

ఆస్తమాను పెంచేస్తుంది
మీకు ఉబ్బసం, అలెర్జీలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే పెరుగును తినకూడదు. తినడం ఆ సమస్యలు అధికం అవుతాయి. ముఖ్యంగా ఆస్తమా ఉన్నవాళ్లు రాత్రిపూట పెరుగును దూరం పెట్టాల్సిందే. ఒక్కోసారి తీవ్రమైన లక్షణాలను దారతీసే ప్రమాదం ఉంది. అనేక సైడ్ ఎఫెక్టులు కూడా కలిగే అవకాశం ఉంది. 

పొట్ట నిండుగా...
పెరుగన్నం తినడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల నిద్రపోవడం ఇబ్బందిగా మారుతుంది, పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోలేరు. పెరుగు తినాల్సి వస్తే మజ్జిగలా చేసుకుని తినడం ఉత్తమం. పెరుగులో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి. ఈ బ్యాక్టిరియాలు మన శరీరానికి అవసరం కాబట్టి మధ్యాహ్నం పూట, బ్రేక్ పాస్ట్ సమయంలో పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. 

కఫ దోషం
ఆయుర్వేదం ప్రకారం పెరుగను రాత్రి పూట తినడం వల్ల కఫ దోషం పెరుగుతుంది. ఇది అసమతుల్యతలకు కారణం అవుతుంది. ముక్కులో అధికంగా శ్లేష్మం పెరిగేలా చేస్తుంది. దగ్గు జలుబుకు కారణం అవుతుంది. 

అసిడిటీ వస్తుంది
కొందరిలో అసిడిటీ త్వరగా వచ్చేస్తుంది. అలాంటి వారు రాత్రి పూట పెరుగు తినడానికి దూరంగా ఉండాలి. కొన్నిసార్లు రాత్రిపూట పెరుగు తినడం ఎసిడిటీ సమస్యను పెంచుతుంది. 

Also read: మీరు ఎంత తిన్నా బరువు పెరగని ఆహారాలు ఇవన్నీ,భయపడకుండా నచ్చినంత తినండి

Also read: యుక్త వయసును వృథా చేస్తే అంధకారమే, ఇలాంటి పనులు చేస్తే త్వరగా ముసలివాళ్లయిపోతారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sleep in Summer Heat : రాత్రుళ్లు వేడి వల్ల నిద్ర రావట్లేదా? ఏసీ లేకున్నా కూల్‌గా నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి
రాత్రుళ్లు వేడి వల్ల నిద్ర రావట్లేదా? ఏసీ లేకున్నా ఈ టిప్స్ ఫాలో అయితే హాయిగా నిద్రపోవచ్చు
Pomegranate Benefits : రోజూ ఒక గిన్నె దానిమ్మ గింజలు తింటే.. శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
రోజూ ఒక గిన్నె దానిమ్మ గింజలు తింటే.. శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే
Cucumber Water : వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
వేసవిలో కీరా వాటర్ తాగితే కలిగే లాభాలివే.. హైడ్రేషన్ నుంచి బరువు తగ్గేవరకు ఎన్నో లాభాలు
Smartwatch Buying Tips : స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS CSK Updates: ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ.. 2 వ‌రుస విజ‌యాలతో జోరు.. స‌త్తా చాటిన భువీ, 43 ర‌న్స్ తో సీఎస్కే చిత్తు
AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!
IPL 2026 SRH VS LSG Result Update: పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన ల‌క్నో.. బ్యాటింగ్ వైఫల్యంతో స‌న్ రైజ‌ర్స్ కు ప‌రాజ‌యం
MAVIGUN : జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
జగన్ MAVIGUN ట్రెండ్ - టైటిల్ రిజిస్టర్ చేయించిన ప్రొడ్యూసర్!... ఏ జానర్‌లో మూవీ తీస్తారో?
Khanapur Municipal Chairman: కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
కాంగ్రెస్‌కు నిరాశే.. ఖానాపూర్ మున్సిపాలిటీ దక్కించుకున్న బీజేపీ, వైస్ చైర్మన్‌గా బీఆర్ఎస్
RTC Bus Catches Fire: హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్సులో మంటలు.. కడప జిల్లాలో ప్రమాదం
Vignesh Shivan : హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
హీరోగా సినిమా ఓకే చేసిన అనిరుధ్ - లాస్ట్ మూమెంట్‌లో యాక్టింగ్ ఎందుకు మానేశాడంటే?
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
ఎస్‌యూవీల‌కు గండి కొట్టిన‌ మారుతి డిజైర్.. మార్చి 2026 సేల్స్‌లో నంబర్ వన్ కారుగా రికార్డు!
Embed widget