Meals: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు
భోజనం చేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదని అంటారు. అలా చేస్తే అనారోగ్య సమస్యలు మనంతట మనమే సృష్టించుకున్నట్టే..
ఆరోగ్యకరంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. డైట్ విషయంలో చాలా క్రమశిక్షణ అవసరం. అల్పాహారం దగ్గర నుంచి రాత్రి వేళ తీసుకుని డిన్నర్ వరకు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త అవసరం లేదంటే అనారోగ్య సమస్యలకి దారి తీస్తుంది. ఏదైనా ఆహారం డైట్లో చేర్చుకునే ముందు తప్పని సరిగా వైద్యుని సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. భోజనం ముందు తర్వాత ఏమేమి తినాలి ఏవి తినకూడదు అనే దాని మీద అవగాహన ఉండాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తిన్న తర్వాత చాలా మంది తల స్నానం చేయడం వంటివి చేస్తారు. కానీ అలా చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అవేంటో చూద్దామా..
☀ తిన్న వెంటనే తలస్నానం చెయ్యకూడదు. భోజనం చేసిన వెంటనే జీవక్రియకి అవసరం అయ్యే విధంగా రక్తం పొట్ట చుట్టూ చేరుతుంది. అటువంటి సమయంలో తలస్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. ఆ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరేందుకు కొంత సమయం పడుతుంది. దానివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్తారు.
☀ తిన్న తర్వాత వ్యాయామం చేసే అలవాటు ఉంటే మానుకోవాలి. భోజనం చేసిన వెంటనే తీవ్రమైన వ్యాయామం జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. ఇది వికారం, కడుపు నొప్పి, వాంతులు అయ్యేందుకు దారితీస్తుంది.
☀ ముందు లేదా కిందకి వంగి పనులు చేయడం నివారించాలి. ఇలా చేయడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ కి కారణం అవుతుంది.
☀ భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మనం తీసుకునే పండ్లు నుంచి పోషకాలని గ్రహించడాన్ని తగ్గిస్తుంది.
☀ కాఫీ తాగకూడదు. అవి కొన్ని ఫినాలిక్ సమ్మేళనాలని కలిగి ఉంటాయి. ఇవి భోజనం నుంచి ఐరన్ వంటి కొన్ని పోషకాలని గ్రహించడంలో ఇబ్బంది పడతాయి.
☀ మద్యపానం లేదా ధూమపానం అసలు చెయ్యకూడదు. సాధారణంగానే ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. భోజనం తర్వాత వాటిని తీసుకోవడం ఆరోగ్య ప్రమాదాలను మరింత పెంచుతుంది.
☀ టీవీ చూస్తూ అసలు భోజనం చెయ్యకూడదు. ఎందుకంటే అలా తినడం వల్ల ఎంత తింటున్నాం అనే దాని మీద అవగాహన ఉండదు. టీవీ చూస్తూ తింటూనే ఉంటారు. అలా చేయడం వల్ల బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు ఎదురవుతాయి.
☀ ఆహారం విచ్చిన్నం చేయడానికి, జీర్ణం కావడానికి తిన్న తర్వాత గోరు వెచ్చని నీటిని తీసుకోవడం మంచిది. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్య ఉన్న వాళ్లకి లేదా ఆలస్యంగా భోజనం చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
☀ మొబైల్ చూస్తూ కూడా భోజనం చెయ్యకూడదు. ఫోన్ మీద ధ్యాస ఎక్కువగా ఉంటుంది. తినే వాటి మీద శ్రద్ధ ఉండదు. పైగా ఎంత ఆహారం తీసుకుంటున్నాం అనేది కూడా తెలియకుండా పోతుంది.
☀ ఆహారం కూడా ఎక్కువ సేపు తినకూడదు. అందుకే ఇంట్లో పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్నం త్వరగా తినాలి. లేట్ గా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని. ఆహారం కూడా బాగా నమిలి మింగాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!
Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే