అన్వేషించండి

Diabetes: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే

డయాబెటిస్ రోగులకి మేలు చేసే ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

మధుమేహం.. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఎదుర్కొంటున్న సమస్య. ఇది వచ్చిందంటే అన్ని అలవాట్లు మార్చుకోవాలి. తీసుకునే ఆహారం దగ్గర నుంచి నిద్ర వేళల వరకు అన్నీ మార్చుకుని తీరాలి. లేదంటే రక్తంలో చక్కెర స్థాయి పెరిగి ఇతర అనారోగ్యాలకు దారి తీసే అవకాశం ఉంది. డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 అయితే రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 చాలా తక్కువ మందికి వస్తుంది. కొందరికి పుట్టక నుంచే ఇన్సులిన్ లోపం ఏర్పడి టైప్-1 డయాబెటిస్ వస్తుంది. కానీ, అత్యధిక మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడతారు. ఇది సాధారణంగా వయసుతో పాటు అభివృద్ధి చెందుతుంది. గతంలో మధుమేహం అనేది వంశపారపర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మారుతున్న జీవనశైలి కారణంగా వయసు తేడా లేకుండా వస్తోంది. దీని వల్ల శరీరంలోని ఇన్సులిన్ పరిమాణం తగ్గిపోతుంది. ఇది చివరికి అధిక చక్కెర స్థాయిలకి దారి తీస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లేకపోతే అది శరీరంలోని ఇతర అవయవాలకి హాని చేస్తుంది. అందుకే షుగర్ పేషెంట్స్ తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. వైద్యుని సలహా ప్రకారం మందులు తీసుకుంటూ షుగర్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. ఔషధాల మార్గం ద్వారానే కాకుండా ఆహారపదార్థాలతో కూడా చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ ఐదు ఆహారాలు మీ డైట్లో భాగం చేసుకుంటే సరిపోతుంది.

విత్తనాలు: చియా గింజలు, అవిసే గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు ఉన్నాయి. వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో సహాయపడతాయి.

నట్స్: బాదంపప్పు, వాల్ నట్స్, పిస్తా, అంజీరా, కిస్ మిస్, ఎండు ఖర్జూరం, జీడిపప్పు వంటివి నట్స్ జాబితాలోకి వస్తాయి. వీటిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. వాటిలో విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వుల వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వీటి ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా వాటిని నానబెట్టుకుని తినాలి. అప్పుడే పూర్తిస్థాయిలో పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.

దాల్చిన చెక్క: కూరలకి రుచి ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ మసాలాలో ఉండే సమ్మేళనాలు రక్తంలో చక్కెరని తగ్గించడంలో సహాయపడతాయి.  ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, గుండె సంబంధ సమస్యలతో బాధపడే వాళ్ళు ఈ దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు ఈ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను కూడా పెంచుతుంది.

పెరుగు: ఇందులో ప్రోబయాటిక్స్ ఉన్నాయి. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గిస్తుంది. పెరుగును అల్పాహారంగా తీసుకోవచ్చు. ప్రొబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టిరియా. ఇది పొట్ట, పేగుల ఆరోగ్యానికి మంచి చేస్తుంది. క్యాల్షియం, మెగ్నిషియం కూడా పుష్కలంగా ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!

Also Read: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget