అన్వేషించండి

Expiry Date: ఈ పదార్థాలు ఇచ్చిన డేట్ కంటే ముందే ఎక్స్‌పైర్ అవుతాయి , జాగ్రత్త పడండి

కొన్ని ఆహార పదార్థాల విషయంలో ఎక్స్ పైరీ డేట్‌ని నమ్మడానికి లేదు.

ప్రతి ఆహార పదార్థానికి ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది.మార్కెట్లలో ప్యాకెట్ల రూపంలో కొన్న ఆహారానికి ఆ ప్యాకెట్ల పైనే ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. దాని కన్నా ముందే ఆహారాలని ఉపయోగించేయాలి అని అర్థం. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇచ్చిన తేదీ కన్నా ముందే కొన్ని రకాల ఆహారాలు పాడైపోతాయి. అవేంటో తెలుసుకుని ముందే వాడేయాల్సిన అవసరం ఉంది. 

ఓట్స్
ఓట్స్ ఇప్పుడు అందరి ఇళ్లలో కనిపిస్తున్నా ఆహారంగా మారింది. ఇది మనదేశంలో పండనప్పటికీ ఇక్కడ మనం విరివిగా ఉపయోగిస్తున్నాం. రోజూ ఓట్స్ ను తినేవాళ్లున్నారు. ముఖ్యంగా హైబీపీ, మధుమేహం, బరువు తగ్గాలనుకునేవారు వీటిని తమ రోజువారీ డైట్‌లో భాగం చేసుకున్నారు. ఆరోగ్యకరమైన అల్పాహారాల్లో ఓట్స్ కూడా ఒకటి. కానీ ఓట్స్ ప్యాకెట్ పై ఉన్న ఎక్స్ పైరీ డేట్ కన్నా ముందే అవి పాడవ్వడం ప్రారంభమవుతాయి. వీటిని కొన్నాక కేవలం 4 నుంచి ఆరునెలల్లోనే ఉపయోగించేయాలి. అందుకే ఓట్స్‌ను అధిక మొత్తంలో ఒకేసారి కొనకుండా చిన్న ప్యాకెట్లుగా కొనుక్కుని వాడుకోవడం ఉత్తమం. 

పిండి
ఏ రకమైన పిండి కొన్నా అది మైదా కావచ్చు, గోధుమపిండి, బియ్యంపిండి... ఇలా ఏదైనా కూడా కొన్ని తరువాత త్వరగా వాడేయాలి. ఇలాంటి పిండి రకాలను ఏళ్లకు ఏళ్లు వాడేస్తుంటారు చాలా మంది. కానీ ఏ పిండైనా మూత పెట్టి గాలి చొరబడకుండా ఉంటే తొమ్మిది నెలల వరకు ఫర్వాలేదు. అందుకే అలాంటి పిండిలను ఏడాదిలోపే వాడేయాలి. ఆ తరువాత అవి చాలా మార్పులకు గురవుతాయి. పురుగు పట్టే అవకాశం ఉంది. పోషకాలు మాత్రం కచ్చితంగా తగ్గిపోతాయి. అలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం కూడా. 

క్యాన్డ్ ఫుడ్
సూపర్ మార్కెట్లలో ఎన్నో రకాల క్యాన్డ్ ఫుడ్ అందబాటులో ఉంటుంది. టిన్ లు, క్యాన్లలో భద్రపరిచిన ఆహారాలను ప్రజలు వాడడం కూడా అధికమే. అందుకే చాలా అధికంగా ప్రిజర్వేటివ్స్ ఉపయోగిస్తారు. క్యాన్డ్ పుడ్స్ పై ఎక్స్‌పైరీ తేదీని నమ్మకపోవడమే మంచిది. ఇలాంటి వాటిని ఏడాదిలోపే తినేయడం చాలా మంచిది. ఏ ఆహారమైన అధికంగా నిల్వ ఉండడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదు. 

నూనెలు 
కొంతమంది నూనెలు ఎన్నాళ్లైనా పాడవవు అని అనుకుంటారు, మూత తీయకుండా ఉండే ఎన్నాళ్లైనా వాటిని నిల్వ చేయచ్చు అనుకుంటారు. మూత తెరవని నూనె డబ్బాలను రెండేళ్ల లోపే వాడుకోవాలి. మూత తీశాక మాత్రం త్వరగానే పూర్తి చేసేయాలి. నూనె నిల్వ ఉంటున్న కొద్దీ దాని వాసన, రుచి మారిపోతుంది. అంతేకాదు నూనె నిల్వ చేయాలనుకుంటే వేడి తగలని ప్రాంతాల్లోనే ఉంచాలి. 

కూరగాయలు
కొన్ని కూరగాయలు వేరే దేశాల నుంచి మనకు దిగుమతి అవుతాయి. అలాంటి వాటిలో అధికంగా ఉండేవి బ్రోకలీ, పుట్టగొడుగులు, బెల్ పెప్పెర్స్, సెలెరీ, లెట్యూస్ వంటివే. వాటిని కొన్న తరువాత వారం రోజుల్లోపే వండుకుని తినేయాలి. ఎందుకంటే అప్పటికే అవి ఎక్కువ కాలం నిల్వ ఉండి మీ వద్దకు చేరి ఉంటాయి. కాబట్టి ఇంకా మరికొన్ని రోజులు ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల ఉపయోగం లేదు. 

Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం

Also read: కాఫీ మరింతగా ఆస్వాదించాలా? వీటిని మిక్స్ చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Dussehra Navratri Day 5 : అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
అమ్మవారికి 5వ రోజు పెట్టాల్సిన నైవేద్యం ఇదే.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి కోసం పులిహోర, పెసర బూరెలు
Samosa Chaat Recipe : ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ సమోసా చాట్.. ఇలా శుభ్రంగా చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది
Desk Job Joint Pain : డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
డెస్క్ ఉద్యోగుల్లో పెరుగుతోన్న కీళ్ల నొప్పులు..ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెప్తోన్న నిపుణులు
High BP : అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త
అధిక రక్తపోటు ఉందని ఈ లక్షణాలతో గుర్తించవచ్చా? తలనొప్పి నుంచి చూపు మసకబారడం వరకు.. జాగ్రత్త

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
UP Blue Drum Case: మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన!
మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు.. భార్య, ప్రియుడికి మరణశిక్ష.. కోర్టులో 'మహాభారత' ప్రస్తావన
Imanvi Esmail: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ ఇమాన్వీ బర్త్ డే సెలబ్రేషన్ ఫోటోలు
మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Embed widget