News
News
X

మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం

మీల్ మేకర్ విషయంలో అందరికీ ఉండే సందేహం ఒక్కటే, అవి దేనితో తయారుచేస్తారు అని?

FOLLOW US: 

మీల్ మేకర్, సోయా చంక్స్... ఈ రెండూ ఒక్కటేనా? ఈ సందేహం మీకు ఉందా? అయితే స్పష్టంగా చెబుతున్నాం వినండి... ఆ రెండూ ఒక్కటే. ఒకప్పుడు మీల్ మేకర్ అనే పేరే వాడుకలో ఉండేది. ఇప్పుడు సోయా చంక్స్ పేరుతో బ్రాండెడ్ మీల్ మేకర్ మార్కెట్లో దొరుకుతుంది. నిజానికి ఈ రెండూ తయారయ్యేది సోయా గింజలతోనే. కాకపోతే నాణ్యతలో మాత్రం తేడాలుంటాయి. తక్కువ నాణ్యత కలవి వండితే చాలు మెత్తగా మారిపోతాయి, మంచి నాణ్యమైనవి వండినా కూడా తినడానికి వీలైనంత మెత్తగా మాత్రమే ఉడుకుతాయి. రుచి కూడా బావుంటుంది. ఇది పూర్తి శాకాహార వంటకం. ఎవరైనా తినవచ్చు. 

తయారీ ఇలా...
సోయా చిక్కుడు గింజల నుంచి ఆయిల్‌ను ముందుగా వేరుచేస్తారు. అప్పుడు సోయా పిండి మిగిలిపోతుంది. సోయా నూనెను తయారుచేస్తున్నప్పుడు ఏర్పడే ఉప పదార్థమే సోయా పిండి. ఆ పిండిని మీల్ మేకర్ గా మారుస్తారు. దీనిలో కూడా పోషకాలు అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా కొవ్వు ఉండదు. దీన్ని వెజిటేరియన్ మీట్ అని చెప్పుకోవచ్చు. అందుకే పాశ్చాత్యదేశాల్లో సోయా మీట్ అని కూడా పిలుస్తారు. 

ఆరోగ్యమా కాదా?
సోయా చంక్స్ లేదా మీల్ మేకర్... ఎలా పిలుచుకోవాలన్నది మీ ఇష్టం. వీటితో చేసిన వంటకాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండెజబ్బులు, క్యాన్సర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని చాలా మేరకు తగ్గిస్తుంది. వీటిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కాబట్టి మాంసాహారం తినని వారికి ఇది ఉత్తమ ఎంపిక. శక్తి బాగా అందుతుంది.వీటవి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొవ్వు శాతం పెరుగుతుంది. అందుకే వీటిని తినడం వల్ల బరువు కూడా పెరగరు, పైగా తగ్గుతారు కూడా. ఇవి ఫైబర్ తో నిండి ఉంటాయి. కాబట్టి మధుమేహం ఉన్న వారు వీటిని తమ ఆహార మెనూలో చేర్చుకోవచ్చు. సులభంగా జీర్ణం అవుతాయి. ఎలాంటి అజీర్తి సమస్యలు రావు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా పెరుగుతాయి. 

ఏం వండుకోవచ్చు...
మీరు కావాలనుకుంటే మీల్ మేకర్ కర్రీ వండుకోవచ్చు. లేదంటే కూరల్లో కలుపుగా వాడుకోవచ్చు. అంటే వంకాయ కూర, బంగాళాదుంప కూర, క్యాబేజీ కూర, కాలీ ఫ్లవర్ కూర వండి నప్పుడు వాటిల్లో కలిపేసి వండేయచ్చు. రుచి కూడా బావుంటుంది. ముఖ్యంగా బిర్యానీలు వండినప్పుడు వీటిని కలిపి వండుకోవడం వల్ల చాలా రుచి పెరుగుతుంది. 

Also read: కాఫీ మరింతగా ఆస్వాదించాలా? వీటిని మిక్స్ చేసుకుని తాగితే ఆ కిక్కే వేరు

Also read: వరలక్ష్మీ వ్రతానికి బెల్లం అన్నం, పులగం రెసిపీలు ఇవిగో, ఇలా సింపుల్‌గా చేసేయచ్చు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 01 Aug 2022 09:43 AM (IST) Tags: Making of Meal maker Making of Soya chinks Health Benefits of Soya Chunks Health benefits of Meal maker

సంబంధిత కథనాలు

ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?

ఫిట్స్ ఎందుకొస్తాయి? రోగి చేతిలో తాళం చేతులు ఎందుకు పెట్టకూడదు? మూర్ఛ వచ్చిన వెంటనే ఏం చేయాలి?

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Vitamin K2: విటమిన్ K2 - ఇది లోపిస్తే ఆరోగ్యానికి చేటు, ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Food: ఈ టేస్టీ ఫుడ్ వద్దు డూడ్, పొట్ట పెంచేస్తాయ్, పరేషాన్ చేసేస్తాయ్!

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Drinking Water: భోజనం మధ్యలో నీరు తాగితే బరువు పెరుగుతారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో చూడండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

Breakfast: మీ గుండె పదిలంగా ఉండాలంటే ఈ బ్రేక్ ఫాస్ట్ తినెయ్యండి

టాప్ స్టోరీస్

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!

ఇక ఆన్‌లైన్‌లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!