అన్వేషించండి

Morning Drinks: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!

ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ మాత్రమే కాదు వీటిని తాగినా కూడా బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు.

ఉదయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతారు. రాత్రంతా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు రీఫ్రెష్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. వాటితో రోజు ప్రారంభించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతారు. వివిధ ఆరోగ్యకరమైన పానీయాలు కూడా ఒక్కోసారి శరీరాన్ని డీ హైడ్రేట్ కి గురి చేస్తాయి. అందుకే ముందుగా నీరు తాగిన తర్వాత ఏదైనా కాఫీ లేదా టీ తీసుకోవాలని అంటారు. నీళ్ళు తాగడం వల్ల డీహైడ్రేట్ నుంచి నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే నీటితో పాటు మరికొన్ని పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేమిటంటే.. 

యాపిల్ సిడర్ వెనిగర్

ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే వాటిలో యాపిల్ సిడర్ వెనిగర్ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని నీటితో కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సాధారణ పానీయం జీర్ణక్రియని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. జీవక్రియని పెంచి కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది. మెదడు పని తీరుకి సహాయపడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షణగా నిలుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

బ్లాక్ కాఫీ

అపారమైన ప్రయోజనాలతో కూడిన ఆరోగ్యకరమైన పానియాలలో కాఫీ ఒకటి. అది కూడా బ్లాక్ కాఫీ తాగడం అన్నీ విధాలుగా మంచిది. ఉదయం కాఫీని తీసుకోవడం వల్ల కారిస్టల్ అనే హార్మోన్ ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ అనేది కిడ్నీలోని అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే స్టెరాయిడ్ హార్మోన్. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీవక్రియని మెరుగుపరుస్తుంది.

ఆలోవెరా జ్యూస్

గాయాలు, చర్మ సమస్యలను నయం చేయడానికి ఆలోవెరాకి మించిన గొప్ప ఔషధం లేదు. శరీర ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కలబంద చాలా మంచిది. కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయాంతర పేగుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పేగుల్లో వచ్చే వ్యాధులని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది. మధుమేహ రోగులకి కలబంద చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయాన్నే కొద్దిగా కలబంద గుజ్జు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

టమాటో రసం

టమాటో జ్యూస్‌తో రోజును ప్రారంభించడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అసిడిటీ సమస్యని ఎదుర్కోవడమే కాకుండా సులభంగా లభించే పోషకాలను సరఫరా చేయడం ద్వారా అవయవాలను సక్రియం చేస్తుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు

Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!

టాప్ హెడ్ లైన్స్

Dry Skin in Winter : చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
చర్మం పొడిబారి తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? చలికాలంలో డ్రై స్కిన్‌కు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raja Singh Letter: సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
సజ్జనార్‌పై సీబీఐ దర్యాప్తు.. సీఎంకు ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ!
AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు.. వేడెక్కిన పల్లె రాజకీయం
IND vs NZ 5th ODI Highlights: ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
ఉత్కంఠ పోరులో భారత్ విజయం.. న్యూజిలాండ్‌పై 3-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
కర్నూలులో కామాంధుడు.. ఆవుపై లైంగిక దాడి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిన స్థానికులు
BJP Ramchander Rao: హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
హైదరాబాద్‌ వేదికగా భారత్ ప్రతిష్ఠకు మచ్చ.. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి: రాంచందర్ రావు డిమాండ్
Priya Bhavani Shankar Wedding : భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
భర్తతో 'ఇరుముడి' హీరోయిన్ - నవ వధువు క్యూట్ మూమెంట్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ చోరీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
Embed widget