News
News
వీడియోలు ఆటలు
X

ఈ ఊరు మొత్తాన్ని అద్దెకిచ్చేస్తారు, స్నేహితులతో వేడుకలకు ఇది పర్‌ఫెక్ట్ ప్లేస్

స్నేహితులతో అలా కొన్ని రోజులు గడిపి రావాలనుకున్నా, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకున్నా ఈ గ్రామం ఉత్తమ ఎంపిక.

FOLLOW US: 
Share:

వారం రోజులు స్నేహితుల గుంపుతో అలా విదేశాలకు వెళ్లి సేద తీరాలనుకుంటున్నారా? అలా అయితే ఈ గ్రామాన్ని అద్దెకి తీసుకోండి. ఈ గ్రామం మొత్తం ఆ వారం రోజులు మీదే. ఏం చేసినా అడిగే వారు ఉండరు. స్నేహితులతో ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లు, కోటలు, తోటలు, భవనాలు, అన్ని రకాల ఆటలు ఇక్కడ లభిస్తాయి. కేవలం స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి కాదు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా ఇది అనువైన ప్రదేశం. పెద్ద ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడ సేద తీరవచ్చు. ఈ గ్రామం ఇటలీలోని ‘లే మార్షే’ ప్రాంతంలో ఉంది. పేరు పెట్రిటోలి. 

పెట్రిటోలి గ్రామం ప్రజలు నివసించడానికి అనువుగా ఉంటుంది. దాదాపు 200 మంది అతిధులు నివాసం ఉండేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఇల్లులు మధ్యయుగం నాటి గృహాల్లా కనిపిస్తాయి. కోటలు కూడా దర్శనమిస్తాయి. ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది, అయితే ఈ విలేజ్‌ను అద్దెకు తీసుకోవాలంటే కనీసం 50 మంది అతిధులు రావాలి. అప్పుడే దీన్ని అద్దెకిస్తారు.

ఈ గ్రామాన్ని అద్దెకి తీసుకోవాలంటే ఒక రాత్రికి 1577 డాలర్లు చెల్లించాలి. అంటే ఒక రాత్రికి తొమ్మిదిన్నర లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 50 మంది అతిధులు కలిసి వెళితే అందులో ఒక్కొక్కరు ఒకరోజు ఉన్నందుకు 19000 రూపాయలు చెల్లించాలి. అదే రెండు వందల మంది వెళితే ఒక్కొక్కరు రోజుకి 4700 రూపాయలు చెల్లించాలి. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఇది ఉత్తమ ప్రదేశంగా భావిస్తారు. చాలా తక్కువ ఖర్చుతో ఈ గ్రామంలో పెళ్లి వేడుకలు పూర్తవుతాయి. 50 మంది కుటుంబసభ్యులతో అలా విదేశాలకు టూర్ వెళ్లాలనుకున్నా కూడా ఇది ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

గ్రామంలోకి వచ్చాక వాహనాలు, ఊరి చివరలోనే నిలిచిపోవాలి. గ్రామం మధ్యభాగంలో తిరగడానికి వీల్లేదు. వీధుల్లో కాఫీ దుకాణాలు, కిరాణా దుకాణాలు, పిజ్జా షాపులు, పార్లర్లు ఇలా అన్ని నిండి ఉంటాయి. సముద్రతీరం కేవలం 12 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడి బీచ్‌లకు వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయవచ్చు. 

ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు కూడా అధికంగానే ఉంటాయి. విందులకు, సమావేశాలకు వీలైన భవనాలు కొలువుదీరి ఉన్నాయి. 17 వ శతాబ్దపు స్కూలు, 18వ శతాబ్దపు ప్రింటింగ్ హాలు, పార్కులు వంటివి ఇక్కడ కనిపిస్తాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ లేదా సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నప్పుడు వారికి భోజనాలు, సదుపాయాలు చూసేందుకు ప్రత్యేకంగా బృందం అందుబాటులో ఉంది. ఎవరైనా అది తక్కువ ఖర్చులో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే దానికి అత్యుత్తమ ప్రదేశం ఈ గ్రామమే.

Also read: చికెన్ లేదా పనీర్ - ప్రోటీన్ కోసం ఏది తింటే ఆరోగ్యం?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 20 Mar 2023 08:43 AM (IST) Tags: Italy Village Viral News Village for rent Destination weeding Village

సంబంధిత కథనాలు

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Heatstroke: సమ్మర్‌ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!