అన్వేషించండి

Chicken Vs Paneer: చికెన్ లేదా పనీర్ - ప్రోటీన్ కోసం ఏది తింటే ఆరోగ్యం?

ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్లు చికెన్, వెజిటేరియన్లు పనీర్ తింటుంటారు.

శరీరానికి అత్యవసరమైన పోషకాల్లో ప్రోటీన్ మొదటిది. ప్రోటీన్ లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు దాడి చేస్తాయి. అందుకే ప్రోటీన్ నిండిన ఆహారాన్ని తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్లు ఎక్కువగా చికెన్, గుడ్లు మీద ఆధారపడుతుంటే, వెజిటేరియన్లు పనీర్, పప్పులు తింటుంటారు. అయితే చికెన్, పనీర్‌లలో ఏది ఆరోగ్యకరమైనది? ఏది పుష్కలంగా ప్రోటీన్‌ని అందిస్తుంది? ఈ విషయాలకు సమాధానం చెబుతున్నారు పోషకాహార నిపుణులు. 

చికెన్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది లీన్ ప్రోటీన్ ను కలిగి ఉంటుంది. అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ తినడం వల్ల కండరాలు, ఎముకలు ఆరోగ్యంగా, బలంగా మారుతాయి. ఆస్టియో పోరాసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇక పనీర్ విషయానికి వస్తే దీనిలో ఒమేగా త్రీ, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పనీర్ తినే వాళ్ళలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. దీన్ని తినడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ ఉత్పత్తి జరుగుతుంది. బ్రాంకైటిస్, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వ్యాధులను తట్టుకునే రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో పనీర్ ముందుంటుంది. ఇది పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం. 

రెండింట్లో ఏది బెటర్?
పనీర్, చికెన్... ఈ రెండూ తినడం వల్ల ఉపయోగాలే. అయితే ఆ రెండింట్లో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది? పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం ఎక్కువ ప్రోటీన్ కావాలంటే చికెన్ తినాలి. అధిక ప్రోటీన్ అవసరమైన వారంతా రెండు రోజులకు ఒకసారి చికెన్ తినడం వల్ల శరీరానికి మంచే జరుగుతుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎముక సాంద్రతను కాపాడుకోవచ్చు. ఇక శాకాహారులు పనీర్ మీదే ఆధారపడాలి. ప్రతి 100 గ్రాములు చికెన్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటే, ప్రతి 100 గ్రాముల పనీర్‌లో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మాంసాహారం తినే వారంతా ప్రోటీన్ కోసం చికెన్ మీదే ఆధారపడడం మంచిది. 

ఎన్నో పోషకాలు
చికెన్, పనీర్ ఈ రెండింట్లో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. చికెన్‌లో విటమిన్ బి12, నియాసిన్, భాస్వరం పుష్కలంగా ఉంటాయి. ఇక పనీర్‌లో కాల్షియం కూడా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి, దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అంతే కాదు రక్తం గడ్డ కట్టడం, కండరాలు సంకోచించడానికి సహాయపడుతుంది. గుండెలయలను నియంత్రిస్తుంది. 

క్యాలరీలు?
చికెన్, పనీర్ ఈ రెండింట్లో ఏది తక్కువ క్యాలరీలను అందిస్తుందో తెలుసా? చాలామంది పనీర్ అనే చెబుతారు. నిజానికి చికెన్, పన్నీర్ కన్నా తక్కువ క్యాలరీలను అందిస్తుంది. 100 గ్రాముల చికెన్ తినడం వల్ల 165 కేలరీలు శరీరంలో చేరితే, 100 గ్రాముల పనీర్ తినడం వల్ల 265 నుంచి 320 కేలరీలు శరీరంలో చేరుతాయి.

అయితే చికెన్ కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయోటిక్స్ వాడని చికెన్ ని ఎంచుకోవాలి. ఇక పనీర్ విషయానికొస్తే తక్కువ కొవ్వు ఉన్న పనీర్ మంచిది. మీగడ తీసిన పాలతో చేసేది తక్కువ కొవ్వు పనీర్. ఇక మీగడ తీయని పాలతో చేసేది మలై పనీర్. రెండూ మంచివే. కాకపోతే బరువు తగ్గాలనుకునే వారు తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ఎంచుకోవడం మంచిది. 

Also read: పెసరపప్పు - సొరకాయతో క్రిస్పీ దోశె, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget