Chicken Fried Rice Recipe : టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్.. స్ట్రీట్ స్టైల్ లెవెల్లో ఇంట్లోనే ఇలా వండేయండి రెసిపీ ఇదే
Chicken Fried Rice : టేస్టీగా ఇంట్లోనే చేసుకుని లంచ్ చేయాలనుకున్నప్పుడు హాయిగా చికెన్ ఫ్రైడ్ రైస్ వండుకుని తినేయొచ్చు. స్ట్రీట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం.
Street Style Chicken Fried Rice Recipe : చికెన్ ఫ్రైడ్ రైస్‌ని చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఎక్కువగా తింటారు. మీకు కూడా ఈ తరహా ఫుడ్ అంటే ఇష్టముంటే చాలా సింపుల్‌గా ఇంట్లోనే దీనిని తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లెవల్లో ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటి? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
తయారీ విధానం
చికెన్ - పావు కేజి (బోన్ లెస్)
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1 టేబుల్ స్పూన్
గరం మసాల - అర టీస్పూన్
మిరియాల పొడి - అర టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు
నిమ్మరసం - 1 టీస్పూన్
గుడ్డు - 1
కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
వెల్లుల్లి రెబ్బలు - 8
క్యారెట్ - 1 కప్పు
క్యాబేజ్ - 1 కప్పు
క్యాప్సికమ్ - పావు కప్పు
పచ్చిమిర్చి - 5
గుడ్లు - 2
కారం - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
గరం మసాల - అర టీస్పూన్
పెప్పర్ - 1 టీస్పూన్
సోయా సాస్ - 2 టీస్పూన్లు
కొత్తిమీర - 1 టీస్పూన్
అన్నం - 1 గిన్నె
తయారీ విధానం
ముందుగా చికెన్‌ని బాగా కడిగి.. ముక్కలను మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో సాల్ట్, కారం, గరం మసాల, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, నిమ్మరసం గింజలు లేకుండా వేసి కలుపుకోవాలి. ముక్కలకు అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసి దానిలో ఓ గుడ్డును పగలగొట్టి వేయాలి. దానిలో కార్న్ ఫ్లోర్ కూడా వేసి బాగా కలపాలి. దీనిని ఓ గంట పక్కన పెట్టేయాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేవరకు దీనిన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్‌ను అంతా ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలను చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో నూనె వేసి కాగనివ్వాలి. దానిలో వెల్లుల్లిని ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత దానిలో క్యారెట్ ముక్కలు, క్యాబేజ్ తురుము వేసి ఫ్రై చేసుకోవాలి.
క్యారెట్, క్యాబేజి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో కాస్త సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. దానిలో క్యాప్సికమ్, పొడుగ్గా చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని కాస్త పక్కకు జరిపి వాటిలోనే గుడ్లు పగలగొట్టి వేయాలి. అది కాస్త ఉడికిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని.. వెజిటెబుల్స్‌తో కలిపి మిక్స్ చేయాలి. ఎగ్, వెజిటెబుల్స్ మిక్స్ అయ్యాక దానిలో వేయించుకున్న చికెన్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి.
రెండు నిమిషాలు ఇవి మగ్గిన తర్వాత దానిలో కారం, ఉప్పు, గరం మసాల, పెప్పర్, సోయా సాస్ వేసుకుని కలుపుకోవాలి. దానిని కాసేపు మగ్గనిచ్చి.. ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కలుపుకోవాలి. అయితే రైస్ పొడి పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుంది. మెత్తగా ఉంటే అంత బాగోదు. కాబట్టి రైస్ మిగిలినప్పుడైనా.. టేస్టీగా తినాలనిపించినప్పుడైనా ఈ తరహా వంటలు చేసుకుని హాయిగా లాగించేయవచ్చు. రైస్ చికెన్ మిశ్రమం పూర్తిగా కలిసిన తర్వాత చివర్లో కొత్తిమీర చల్లుకుని స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ.
Also Read : చికెన్ లివర్ అంటే ఇష్టమా? బాగా తింటారా? అయితే ఇది మీకోసమే.. మగవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి