Chicken Chinthamani : టేస్టీ చికెన్ చింతామణి రెసిపీ.. సైడ్ డిష్‌గా సూపర్ పర్ఫెక్ట్, ఈజీగా చేసేయండిలా
Chicken Recipes :చికెన్‌తో ఎన్నో రెసిపీలు ట్రై చేయవచ్చు. వాటిలో చికెన్ చింతామణి ఒకటి. దీనిని చేయడం చాలా తేలిక. సైడ్ డిష్‌గా చేసుకోవాలనుకుంటే ఇది ఫాలో అయిపోండి.

Chicken Chinthamani Recipe : చికెన్ అంటే ఇష్టమా? అయితే మీరు చికెన్‌తో చాలా రెసిపీలే ట్రై చేసి ఉంటారు. కోడి కూర నుంచి ఫ్రైవరకు.. బిర్యానీ నుంచి సూప్వరకు ఎన్నో టేస్టీ రెసిపీలు ఉన్నాయి. అయితే మీరు స్టఫ్‌కోసం లేదా సైడ్ డిష్‌గా చికెన్ తీసుకోవాలనుకుంటే చికెన్ చింతామణి రెసిపీని ట్రై చేయవచ్చు. చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా చేసుకోగలిగే రెసిపీని మీరు కూడా వండుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - 300 గ్రాములు
నూనె - 15 మిల్లీ లీటర్
ఎండుమిర్చి - 8 నుంచి 10
ఉల్లిపాయలు - 2 పెద్దవి
కరివేపాకు - 10 ఆకులు
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
తయారీ విధానం
ముందుగా చికెన్ కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చిలో విత్తనాలు లేకుండా రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా, పొడుగ్గా కోసుకోవాలి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచాలి. దానిలో నూనె వేయాలి. ముందు ఎండుమిర్చిలను నూనెలో వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి మీకు కారం ఎంతకావాలో చూసి దానికి తగ్గట్లు ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు.
ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత పెద్దగా కోసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగుతున్నప్పుడే కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తగా అయిన తర్వాత దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న చికన్ వేసుకోవాలి. వాటిని అన్ని కలిసేలా గరిటతో కలపాలి. చికెన్ లేయర్ కాస్త తెల్లగా మారినప్పుడు ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. అంతే దీనిలో ఇంకేమి మసాలాలు వేయము.
చికెన్ మూతపెట్టి మగ్గనివ్వాలి. ఎలాంటి నీళ్లు వేయకూడదు. మూతపెడితే చికెన్‌లోని నీళ్లు బయటకు వస్తాయి. అవి చికెన్ ఉడికేందుకు సరిపోతాయి. తక్కువ మంట మీద చికెన్‌ను పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి. అంతే చికెన్ చింతామణి డిష్ రెడీ. దీనిని సైడ్ డిష్‌గా, స్టార్టర్‌గా తినొచ్చు. చివర్లో కొత్తిమీర వేసుకుంటే రుచి హైలెట్ ఉంటుంది.






















