Korean-Style Maggi with Chicken : కొరియన్ స్టైల్ చికెన్ మ్యాగీ.. సింపుల్‌గా చేసుకునేందుకు ఈ రెసిపీ ఫాలో అయిపోండి
Chicken Maggi Recipe : చికెన్, మ్యాగీని ఇష్టపడేవారు ఇంట్లోనే సింపుల్‌గా చికెన్ మ్యాగీ చేసేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ ఫుడ్ రెసిపీని ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Korean-Style Maggi with Chicken Recipe : మ్యాగీని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే దాని రుచిని పూర్తిగా ఆస్వాదించాలంటే కొరియన్ స్టైల్ చికెన్ మ్యాగీని ట్రై చేసుకోవాల్సిందే. ఒకవేళ మీకు చికెన్ ఇష్టముంటే కొరియన్ స్టైల్లో చికెన్ మ్యాగీని కచ్చితంగా రుచి చూడాలి. ఒక్కసారి చేసుకుంటే మీరు దానిని మళ్లీ మళ్లీ తినాలనుకుంటారు. మరి ఈ రెసిపీని చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తే ఇది రుచిగా వస్తుందో చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
చికెన్ - 100 గ్రాములు
ఉప్పు - రుచికి తగినంత
కారం - 1 టీస్పూన్
నూనె - 1 టీస్పూన్
పెరుగు - 1 టేబుల్ స్పూన్
మ్యాగీ - 2 ప్యాకెట్లు
ఉప్పు - రుచికి తగినంత
స్ప్రింగ్ ఆనియన్స్ - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 3
కారం - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
చికెన్‌ను బాగా కడిగి దానిలో ఉప్పు, కారం, నూనె వేసి కలపాలి. దానిలోనే పెరుగు వేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి. అయితే మీరు చికెన్‌ను ఎయిర్ ఫ్రెషర్లో నేరుగా పెట్టేస్తే చికెన్ రెడీ అయిపోతుంది. లేదు మామూలుగానే ఫ్రై చేసుకోవాలనుకుంటే ఉడికించి లేదా ఫ్రై చేసుకుని తినవచ్చు. నార్మల్‌గా కడాయి ఫ్రై చేసుకుని అయినా చికెన్‌ను రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టౌవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి దానిలో నీటిని పోయండి. అవి కాస్త వేడి అయిన తర్వాత మ్యాగీ వేయండి. దానిలో మసాలా ఏమి వేయకండి. అవి ఉడికిన తర్వాత వాటిని నీటినుంచి తీసేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. దానిలో కారం, ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు, మ్యాగీ మసాలా వేసుకుని కలపాలి.
స్టౌవ్ వెలిగించి ఓ చిన్న కడాయిలో నూనె వేయాలి. దానిలో జీలకర్ర వేసి వేయించాలి. ఈ నూనె మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కొరియన్ స్టైల్ మ్యాగీ ఫీల్ తీసుకువస్తుంది. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలిపి దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి.
మ్యాగీ, మసాలా బాగా కలిసేలా కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి.. సర్వ్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొరియన్ స్టైల్ చికెన్ మ్యాగీ రెడి. దీనిని మీరు వేడిగా తినొచ్చు. లేదంటే బాక్స్‌లో పార్సిల్ చేసుకుని ఆఫీస్‌కి కూడా తీసుకెళ్లవచ్చు. కొరియన్ స్టైల్లో తయారు చేసుకోవడం వల్ల ఈ మ్యాగీ ఎక్కువసేపు ఉంటుంది. మీకు ఒవెన్ అందుబాటులో ఉంటే వేడి చేసుకుని కూడా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. పిల్లల నుంచి పెద్దలవరకు టేస్టీగా ఈ మ్యాగీ రెసిపీని ఎంజాయ్ చేయాలనుకుంటే దీనిని ట్రై చేయవచ్చు.






















