Mango Ice Cream : సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ.. ఇంట్లోనే సింపుల్‌గా, టేస్టీగా చేసేయండిలా
Delicious Mango Ice Cream Recipe : వేసవి వేడిని దూరం చేసి నోటికి రుచిగా మ్యాంగో ఐస్‌క్రీమ్ తింటే క్రేజీ ఉంటుంది కదా. ఈ టేస్టీ రెసిపీని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

Mango Ice Cream Recipe : మ్యాంగో అంటే ఇష్టమున్నవారు కచ్చితంగా మ్యాంగో ఐస్‌క్రీమ్‌ని కూడా ఇష్టపడతారు. బయటవాళ్లు ఎలా చేస్తారో అనే ఆలోచించేవారు చాలా సింపుల్‌గా అతి తక్కువ పదార్థాలతో మ్యాంగో ఐస్‌క్రీమ్‌ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది ఐస్‌క్రీమ్‌ని ఆస్వాదించవచ్చు. సమ్మర్ స్పెషల్ మ్యాంగో ఐస్‌క్రీమ్‌ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
పాలు - అర లీటర్
పంచదార - మూడు టేబుల్ స్పూన్లు
కస్టర్డ్ పౌడర్ - 1 టేబుల్ స్పూన్ (మ్యాంగో ఫ్లేవర్)
మామిడి పండ్లు - 2
జీడిపప్పు - 10
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టాలి. దానిలో పాలు వేసి మరగనివ్వాలి. పాలు వేడి అయ్యాక.. ఓ పావు కప్పు పాలు తీసి పక్కన పెట్టి మిగిలిన పాలను మరగనివ్వాలి. అడుగు పట్టకుండా దానిని గరిటెతో కలుపుతూ ఉండాలి. నాలుగైదు నిమిషాలు పాలు మరిగితే ఐస్ క్రీమ్ రుచి బాగా వస్తుంది. ఇలా పాలు దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పాలల్లో మ్యాంగో ఫ్లేవర్ కస్టర్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. కస్టర్ట్ పౌడర్ అందుబాటులో లేకుంటే కార్న్ ఫ్లోర్‌ని కూడా ఇదే విధంగా పాలల్లో కలిపి ఉండలు లేకుండా చూసుకోవాలి.
స్టౌవ్ మీద పాలు మరుగుతున్న సమయంలో పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార పాలల్లో కరుగుతున్నప్పుడు ముందుగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్‌ని వేసి కలపాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు పాలల్లో కస్టర్డ్ బాగా కలుస్తూ ఉంటుంది. కాసేపు ఉడికిస్తే దగ్గర అవుతుంది. ఓ నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిని చల్లారనివ్వాలి. మధ్యలో కలుపుతూ చల్లారబెడితే మంచిది.
కస్టర్డ్ మిక్స్ చల్లారే లోపు ఓ మిక్సీ జార్ తీసుకుని దానిలో జీడిపప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. అనంతరం దానిలో పైన తొక్క తీసేసిన మామిడి ముక్కలు వేసి ప్యూరీగా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ మిక్స్‌ని ప్యూరీ బాగా బ్లెండ్ అయ్యేలా మిక్సీలో వేయాలి. ఇది పూర్తిగా మెత్తగా అయిన తర్వాత ఓ కంటైనర్‌లో వేసుకోవాలి. దానిని ఫాయిల్‌తో లేదా కవర్‌తో కవర్ చేసి పది నుంచి పన్నెండు గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంతే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ.
మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకునేప్పుడు మ్యాంగో ముక్కలు, డ్రై ఫ్రూట్స్ మిక్స్ మిక్స్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందే వీటిని వేసుకుని నేరుగా సర్వ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఐస్ క్రీమ్ రుచి మరింత రెట్టింపు అవుతుంది. దీనిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు. సమ్మర్లో ఈ టేస్టీ, చల్లని మ్యాంగో ఐస్‌క్రీమ్ మీకు మంచి ట్రీట్‌నిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి.






















