Summer Special Mango Milk Shake : సమ్మర్ స్పెషల్ మ్యాంగో మిల్క్ షేక్.. ఈ సింపుల్ స్టెప్స్‌తో టేస్టీగా చేసేసుకోండి
Mango Milk Shake : మ్యాంగో మిల్క్ షేక్‌ని ఇంట్లో సింపుల్ టిప్స్‌తో రెడీ చేసుకోవచ్చు. మండే వేసవిలో.. చల్లటి మ్యాంగో మిల్క్ షేక్ ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Tasty Mango Milk Shake Recipe : వేసవిలో మామిడి పండ్లతో పాటు.. వాటితో తయారు చేసే ఎన్నో రెసిపీలకు మంచి పేరు ఉంది. వాటిలో మిల్క్ షేక్ ఒకటి. వేడి వేడి ఎండల్లో చల్లటి మ్యాంగో మిల్క్‌షేక్ తాగితే ప్రాణం లేచి వస్తుంది. మరి ఈ టేస్టీ, కమ్మని, చల్లని మిల్క్‌షేక్ (Mango Milk Shake) కోసం బయటకు వెళ్లాల్సివస్తుందా? అయితే దీనిని మీరు ఇంట్లోనే చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇక్కడ ఉంది. ఈ టేస్టీ రెసిపీని ఏవిధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మామిడి పండ్లు - 2
పాలు - 350 మి.లీ
పెరుగు - అర లీటర్
పంచదార - ముప్పావు కప్పు
మ్యాంగో ఎసెన్స్ - పావు టీస్పూన్
జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్లు
ఐస్ క్యూబ్స్ - 20
తయారీ విధానం
ముందుగా మామిడిపండ్లను పైన తొక్క తీసి.. గుజ్జును ముక్కలుగా కోసి ఓ బౌల్లోకి తీసుకోవాలి. వాటిని ఫ్రిడ్జ్‌లో ఓ గంట ఉంచాలి. అప్పుడే మిల్క్ షేక్ సమ్మర్లో మీరు చిల్ అయ్యేలా చేస్తుంది. కూల్‌గా ఉండడం వల్ల మ్యాంగో మిల్క్ షేక్ తాగుతున్నప్పుడు మీకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు పాలను కాచుకుని.. అవి వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అవి కూడా పూర్తిగా చల్లగా ఉండాలి. ఇప్పుడు జీడిపప్పును ఓ అరగంట నానబెట్టుకోవాలి. జీడిపప్పు కేవలం ఆప్షనే. కానీ రుచి కావాలనుకున్నప్పుడు దీనిని స్కిప్ చేయకపోవడమే మంచిది. ఈలోపు చక్కెరను మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అది మెత్తగా పొడి అయ్యేవరకు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మామిడి పండ్ల ముక్కలను ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి.. వాటిని బ్లెండర్లో వేసుకోవాలి. దానిలో చల్లని పాలు, పంచదార, మ్యాంగో ఎసెన్స్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ చేసుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ వల్ల మిల్క్ షేక్ మరింత రుచిగా మారుతుంది. మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. వద్దు అనుకునేవారు దీనిని పూర్తిగా స్కిప్ చేసేయవచ్చు. కాస్త తాగినప్పుడు మంచి ఫ్లేవర్ కావాలనుకుంటే మాత్రం కచ్చితంగా దీనిని వేసుకోండి. ఇప్పుడు హై స్పీడ్‌లో మిల్క్‌షేక్‌ను బ్లెండ్ చేయాలి. అనంతరం దానిలో పెరుగు వేసి.. మరోసారి హై స్పీడ్‌లో బ్లెండ్ చేయాలి.
మామిడి ముక్కలు పూర్తిగా బ్లెండ్ అయి.. పాలు, పెరుగులో పూర్తిగా కలిసిపోయేలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్‌లలో మ్యాంగో మిల్క్ షేక్‌ని వేసుకుని సర్వ చేసుకోవాలి. నానబెట్టిన జీడిప్పపు, మామిడి ముక్కలతో దీనిని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనిని మీరు రెగ్యూలర్‌గా చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే తాగవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో ఉంచి.. మరింత చల్లగా అయిన తర్వాత అయినా సేవించవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేసి.. పిల్లలకు, పెద్దలకు అందించేయండి.
Also Read : టేస్టీ, ఇన్స్టాంట్ ఉతప్పం రెసిపీ.. చాలా ఈజీగా దీనిని రెడీ చేసుకోవచ్చు