అన్వేషించండి

Mango Sooji Halwa Recipe : టేస్టీ స్వీట్ మ్యాంగో హల్వా రెసిపీ.. రవ్వతో ఇలా ఈజీగా చేసేయండి

Summer Mango Dessert : మామిడిపండ్లతో మీరు టేస్టీగా ఏమైనా తయారు చేయాలనుకుంటే మ్యాంగో హల్వాను తయారు చేయవచ్చు. పైగా దీనిని ప్రిపేర్ చేయడం చాలా తేలిక.

Quick Mango Sweet Recipes : మీకు మామిడిపండ్లంటో ఇష్టమా? అయితే మీరు తప్పకుండా మ్యాంగో రవ్వ హల్వాను ట్రై చేయాల్సింది. హల్వా అంటే చాలా కష్టపడాలని అనుకుంటున్నారేమో.. అస్సలు కాదు. చాలా సింపుల్​గా దీనిని తయారు చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కొత్తగా మ్యాంగో స్పెషల్ స్వీట్స్ తయారు చేయాలనుకున్నప్పుడు దీనిని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

కావాల్సిన పదార్థాలు

నెయ్యి - పావు కప్పు

రవ్వ - 1 కప్పు

పాలు - 2 కప్పులు

పంచదార - అరకప్పు

మామిడి గుజ్జు- అరకప్పు

యాలకుల పొడి - 1 టీస్పూన్

వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ - పావుకప్పు

తయారీ విధానం

ముందుగా మామిడి పండ్లను బాగా కడిగి.. వాటిపై తొక్కను తీసి.. ముక్కలుగా కోసుకోవాలి. లేదా బాగా పండిన మామిడి పండ్ల నుంచి గుజ్జును తీసి.. మిక్సీలో వేసుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిలో నెయ్యి వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్​ని వేయించుకుని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో రవ్వను వేసుకోవాలి. 

రవ్వ, నెయ్యి బాగా మిక్స్​ అయ్యేలా కలపాలి. ఉండలు రాకుండా.. అడుగున మాడు పట్టకుండా చిన్న మంటపై ఫ్రై చేసుకోవాలి. రవ్వలోకి నెయ్యి ఇంకిపోయి.. కాస్త వేగిన తర్వాత దానిలో పాలు వేసుకోవాలి. పాలు రవ్వకు బాగా పట్టేలా చిన్న మంటపై ఉడికిస్తూ.. ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో పంచదార కూడా వేసుకుని కలుపుకోవాలి. 

పంచదార వేసి ఓసారి కలిపి దానిలో యాలకుల పొడి వేసి కలపాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే దానిని పాలల్లో కలిపి నానబెట్టి.. ఈ సమయంలో వేసుకోవచ్చు. ఇది మంచి రుచితో పాటు రంగును కూడా ఇస్తుంది. పంచదార కరిగి రవ్వలో కలిసిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మ్యాంగో పల్ప్​ని వేయాలి. రవ్వతో మామిడి పండు గుజ్జు బాగా కలిసేలా చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. 

రవ్వలో మ్యాంగో పల్ప్ చేరిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాగా కలిపి స్టౌవ్ ఆపేసుకోవాలి. అంతే టేస్టీ స్వీట్ రెసిపీ మ్యాంగో రవ్వ హల్వా రెడీ. దీనిని మ్యాంగో ఫ్లేవర్స్​ని ఇష్టపడేవారు.. స్వీట్​ని ఇష్టంగా తినేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు మ్యాంగో పల్ప్ సిద్ధంగా ఉన్నప్పుడు మీరు దీనిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. గెస్ట్​లు వచ్చినప్పుడు చేసి పెట్టడానికి కూడా వీలుగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా దీనిని ట్రై చేసేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Overnight Oats Recipe : కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
కోకో పౌడర్‌తో ఓవర్‌నైట్ ఓట్స్.. బరువు తగ్గాలనుకునేవారికి టేస్టీ బ్రేక్‌ఫాస్ట్
Body Itching : శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
శరీరమంతా దురదగా ఉందా? ఈ లక్షణాలు కూడా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
Raw Banana Fry : క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది
క్రిస్పీగా, టేస్టీగా ఉండే అరటికాయ వేపుడు.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి మరింత పెరుగుతుంది

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget