అన్వేషించండి

Sri Krishna Janmashtami 2024 : కృష్ణాష్టమి స్పెషల్ నేతి హల్వా.. రవ్వతో ఇలా టేస్టీగా చేసి ప్రసాదంగా పెట్టేయండి

Ghee Halwa for Prasadam :మరికొద్ది రోజుల్లో కృష్ణాష్టమి వచ్చేస్తుంది. ఈ సమయంలో కన్నయ్యకు ఇష్టమైన ప్రసాదాలు నేర్చుకుని.. కృష్ణుడి జన్మాష్టమి రోజు కన్నయ్యకు పెట్టేయండి.  

Sri Krishna Janmashtami Special Recipe : కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఎంతో ఇష్టమైన నేతితో పలు రకాల వంటలు చేసి ఆ కృష్ణుడి అనుగ్రహం పొందొచ్చు. అలాంటి వాటిలో నేతితో చేసే హల్వా (Ghee Halwa Recipe) ఒకటి. దీనిని చాలా సింపుల్​గా, టేస్టీగా చేసేయొచ్చు. అయితే టేస్టీగా అని ఎందుకు చెప్తున్నామంటే.. మనం తినేవాటిలో రుచి మంచిగా ఉండాలి అని ఎలా అనుకుంటామో.. దేవుడి ప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయాన్ని ఏ పండుగకు, ఏ ప్రసాదం చేసినా గుర్తించుకోవాలి. ఇంతకీ ఈ నేతి హల్వాను ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

నెయ్యి - ముప్పావు కప్పు

బాదం - రెండు టేబుల్ స్పూన్స్

జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్

ఎండు ద్రాక్ష - 1 టేబుల్ స్పూన్

రవ్వ - 1 కప్పు

శెనగపిండి - 2 టేబుల్ స్పూన్స్

పాలు - 1 కప్పు

నీళ్లు - రెండు కప్పులు

కుంకుమ పువ్వు - 2 టేబుల్ స్పూన్స్

పంచదార - ముప్పావు కప్పు

యాలకుల పొడి - చిటికెడు

నెయ్యి - పావు కప్పు

తయారీ విధానం

ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టండి. దానిలో నెయ్యి వేసి బాదం పలుకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి. మంటను సిమ్​లో ఉంచి డ్రై ఫ్రూట్స్​ని రోస్ట్ చేయాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుంకుమపువ్వు నానబెట్టుకోవాలి. అనంతరం అదే కడాయిలో కప్పు రవ్వ వేయాలి. దానిలో శనగపిండి వేయాలి. వీటిని కూడా బాగా కలుపుతూ చిన్నమంట మీద వేయించుకోవాలి. నెయ్యి, రవ్వ, పిండి పూర్తిగా కలిసే వరకు మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి. 

ఈ మిశ్రమం రంగు మారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకుంటూ ఉండాలి. ఈలోపు మరోస్టౌవ్ వెలిగించి దానిలో ఓ కప్పు పాలు వేయాలి. దానిలో రెండు కప్పుల నీరు వేయాలి. నానబెట్టుకున్న కుంకుమ పువ్వును ఈ పాలల్లో వేసి బాగా కలపాలి. పాలల్లో కుంకుమపువ్వు కలిశాక.. పాలను మరగనివ్వాలి. పాలు మరిగే సరికి రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి సువాసన వస్తుంది. ఈ సమయంలో మరిగించిన పాలను ఈ రవ్వ మిశ్రమంలో వేసి కలపాలి. 

ఉండలు లేకుండా మిశ్రమాన్ని కలుపుకోవాలి. అప్పుడు పాలు రవ్వను పూర్తిగా పీల్చుకుంటాయి. బాగా కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించాలి. రవ్వ కాస్త మెత్తగా మారుతుంది. ఇప్పుడు దానిలో పంచదార వేసి.. బాగా కలపాలి. పంచదార కరిగి రవ్వలో కలిసిపోయేవరకు కలుపుతూనే ఉండాలి. పంచదార పూర్తిగా కరిగి.. రవ్వకు పట్టుకున్న తర్వాత.. ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలపాలి. చివర్లో చిటికెడు యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. 

అలాగే మరో పావు కప్పు నెయ్యి చివర్లో వేయాలి. ఇలా చేయడం వల్ల హల్వ పొడిగా కాకుండా మెత్తగా, టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ ప్రసాదాన్ని కృష్ణాష్టమి రోజు చేసి.. కన్నయ్యకు నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే మామూలు రోజుల్లో కూడా చేసుకోవచ్చు. ఈ నేతి హల్వా ఇంటిల్లీపాదికి నచ్చుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టంగా దీనిని తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ జన్మాష్టమికి మీరు కూడా ఈ టేస్టీ హల్వాను రెడీ చేసేయండి.

Also Read : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

PM Modi Gifts Gangajal to Mauritius President | మారిషస్ అధ్యక్షుడికి మోదీ విలువైన బహుమతులు | ABP DesamAdilabad Cement Industry Condition | అమిత్ షా హామీ గాల్లో కలిసిపోయిందా..అందుకే అమ్మేస్తున్నారా.? | ABP DesamJeedimetla Ramalingeswara Temple Issue | రామలింగేశ్వర స్వామి గుడిలో చోరీ..హిందూ సంఘాల ఆందోళన | ABP Desamleviathan Snake Mystery | లెవియాథాన్ నిజంగా ఉందా ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR At Assembly: అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ సభ్యులు ఘన స్వాగతం, అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం
Airtel-Starlink Deal: స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
స్టార్‌లింక్‌తో చేతులు కలిపిన ఎయిర్‌టెల్‌ - నేరుగా మీ ఇంటికే సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్!
Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Jabardasth Sowmya Rao: అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
అమ్మ అనారోగ్యంతో మంచం మీద ఉంటే... తండ్రి మరో మహిళతో - స్టేజిపైనే వెక్కివెక్కి ఏడ్చిన 'జబర్దస్త్' సౌమ్య
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
Railway Passengers Alert: సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు మారిన నాలుగు రైళ్లు- అధికారుల ప్రకటన
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్
Samantha: ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
ఇండియాలో హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు... సమంత ఫస్ట్ శాలరీ ఎంతో తెలుసా?
Embed widget