అన్వేషించండి

Tamarind Pulihora : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది 

Chinthapandu Pulihora : పులిహోర.. అందునా ప్రసాదంగా వచ్చే పులిహోర.. అబ్బా ఆ రుచే వేరు ఉంటుంది కదా. కానీ ఇది ఎంత ట్రై చేసినా సేమ్ టేస్ట్ రాదు అనుకునేవారికి ఇక్కడో రెసిపీ ఉంది.

Temple Style Pulihora : సౌత్ ఇండియాలో పులిహోర లేని ఫంక్షన్ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. పూజల నుంచి ఫంక్షన్లవరకు దాదాపు అందరూ దీనిని చేసుకుంటారు. ఇవేమి లేకపోయినా.. ఇంట్లోనే రెగ్యూలర్​గా పులిహోర చేసి.. దాని రుచిని ఆస్వాదించేవారు చాలామందే ఉంటారు. దాని రుచి అలాంటిది మరి. టేస్ట్, స్మెల్, రంగు ఇలా ప్రతి విషయంలోనూ పులిహోరకి పోటి లేదని చెప్పవచ్చు. అయితే మనం ఎంత బాగా పులిహోర చేసినా.. ఎక్కడో కొంచెం వెలితి ఉంటుంది. అబ్బా టెంపుల్​కి వెళ్లినప్పుడు ఇచ్చిన పులిహోర మాదిరి లేదు కానీ బాగుంది అనుకుంటాం. చాలామందిలో ఇదే భావన ఉంటుంది.

టెంపుల్స్​లో ప్రసాదంగా ఇచ్చే పులిహోరలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అబ్బా అది మనం చేసుకునేప్పుడు రావట్లేదే అనుకుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్​తో ఇంట్లోనే టెంపుల్ స్టైల్ పులిహోర చేసుకోవచ్చు. అయితే దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలాంటి టిప్స్ ఫాలో అయితే దీని రుచి హైలైట్ అవుతుంది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

బియ్యం - 250 గ్రాములు

నూనె - పావు కప్పు

కరివేపాకు - 2 రెమ్మలు

పచ్చిమిర్చి - 3

పసుపు - 1 స్పూన్ 

ఉప్పు - రుచికి తగినంత 

చింతపండు - 50 గ్రాములు

మసాలా కోసం..

నూనె - 2 స్పూన్లు

ఆవాలు - అర టీస్పూన్ 

మెంతులు - 1 టీస్పూన్

కరివేపాకు -1 రెబ్బ

ఇంగువ - అర టీస్పూన్

తాళింపు కోసం.. 

నూనె - పావు కప్పు

ఆవాలు - అర టీస్పూన్ 

పల్లీలు - పావు కప్పు

మినపప్పు - 1 టేబుల్ స్పూన్

శనగపప్పు - 1 టేబుల్ స్పూన్

ఎండు మిర్చి - 5

కరివేపాకు - 1 రెబ్బ

ఆవాల మసాల కోసం

ఆవాలు - రెండు స్పూన్లు

ఎండు మిర్చి - 1

అల్లం - అంగుళం

ఉప్పు - రుచికితగినంత 

తయారీ విధానం

ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టాలి. దానినుంచి చింతపండు గుజ్జుని తీసి పక్కనపెట్టుకోవాలి. ఆవాల మసాలా కోసం ఆవాలు, ఎండుమిర్చి, అల్లం, కొద్దిగా ఉప్పును పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవాలు ఘాటుగా ఉంటాయి అనుకుంటారు కొందరు. కానీ అల్లం కూడా వేస్తే దాని ఘాటు తగ్గుతుంది. లేదంటే అది చేదు రుచిని ఇస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని కడిగి.. ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లతో మూడు విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. బియ్యాన్ని కడగాలి కానీ నానబెట్టకూడదు. ఇలా చేస్తే అన్నం విరిగిపోతుంది. అన్నం వేడిగా ఉన్నప్పుడు.. అంటే అన్నం పొగలు వస్తున్న సమయంలోనే పసుపు, నూనె, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 

స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి దానిలో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. అనంతరం దానిలో ఆవాలు, మెంతులు వేసి రోస్ట్ చేయండి. కరివేపాకు కూడా వేసి.. అనంతరం చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. మీకు నచ్చితే కాస్త తురిమిన బెల్లం కూడా వేసుకుని తాలింపుని ఉడికించుకోవాలి. పసుపు, చింతపండు నాణ్యమైనవి ఎంచుకుంటే కచ్చితంగా మీకు ఆలయంలో తయారు చేసే పులిహోర రుచి వస్తుంది. చింతపండు ఉడికిన తర్వాత దానిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆవాల ముద్ద వేసి ఉడికించాలి. అనంతరం స్టౌవ్ ఆపేయాలి. 

ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న అన్నంలో ఈ తాలింపు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. పులిహోర రుచి అంతా దానిని మిక్స్ చేసుకోవడంలోనే దాగి ఉంటుంది. ఇప్పుడు మరోసారి స్టౌవ్ వెలిగించి దానిలో పావు కప్పు నూనె వేసి దానిలో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. నూనె ఎక్కువ వేసుకోకపోతే.. పులిహోర నోటికి అంటుకుని అంత రుచించదు. నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనెలు పులహోర రుచిని బాగా పెంచుతాయి. అనంతరం పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి.. వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముందుగా చింతపండు గుజ్జుతో రెడీ చేసుకున్న అన్నంలో వేసి మిక్స్ చేయాలి. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. 

Also Read : బరువును తగ్గించే హెల్తీ సూప్.. డిన్నర్​కి పర్​ఫెక్ట్​ రెసిపీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Cold Weather Safety Tips : పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
పెరిగిన చలి తీవ్రత.. ఈ టిప్స్ ఫాలో అయితే చలి తగ్గుతుంది, లేదంటే కష్టమే
Embed widget