మ్యాగీని ఇష్టపడేవారికి కొరియన్ స్టైల్ మ్యాగీ తినాలని ఉంటుంది. ముఖ్యంగా కొరియన్ సిరీస్లు ఇష్టపడేవారికి ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. దీనిని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వేడినీళ్లలో మ్యాగీని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నీరు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని దానిలో నువ్వులు, వెల్లుల్లి ముక్కలు వేయాలి. దానిలో ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, మ్యాగ్ మసాల వేసి బాగా కలపాలి. సోయా సాస్, టమాటో కెచప్, కొత్తిమీర , వేడి నూనె వేసి మసాలా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలో ఉడికించిన మ్యాగీ వేసుకుంటే కొరియన్ స్టైల్ మ్యాగీ రెడీ. (Images Source : Unsplash)