విటమిన్ Cని ఆస్కార్బిక్ ఆసిడ్ అని కూడా అంటారు. ఇది నీటిలో కరిగే పోషకం. ఆరోగ్యానికి చాలా అవసరం. ఇదొక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. చర్మానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ C శరీరంలో కొల్లాజెన్ ప్రొడక్షన్‌కు అవసరమైన పోషకం. చర్మం, జుట్టు, కండరాల ఆరోగ్యానికి అవసరమైన పోషకం. విటమిన్ C చర్మాన్ని నున్నగా, యవ్వనంగా, మచ్చలు లేకుండా ఉంచుతుంది. చర్మ ఛాయను కూడా మెరుగుపరుస్తుంది. విటమిన్ - C క్రమం తప్పకుండా తీసుకునే వారిలో సమయానికి ముందే వయసు ప్రభావం చర్మం మీద కనబడకుండా నివారిస్తుంది. విటమిన్ - C చర్మాన్ని యూవీ కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి కూడా కాపాడుతుంది. విటమిన్ C సప్లిమెంట్లు తీసుకుంటే గాయాలు, అల్సర్లు చాలా త్వరగా నయమైనట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels