నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కట్టుకొచ్చే చీరలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇప్పటికి నిర్మలా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఆ ఆరు చీరల కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 2019లో గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళ గిరి చీరలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. పసుపు రంగు సిల్క్ చీరను ధరించారు. 2021లో పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టారు. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు సీతారామన్. 2023లో ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో నలుపు రంగు బార్డర్ ఉన్న ఎరుపు చీరను ధరించారు. ఈసారి (Budget 2024) ఇండిగో బ్లూ కలర్ చీరలో క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఉన్న చీరను కట్టుకు వచ్చారు. (Images Source : X)