కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకునేందుకు ఆయుర్వేదంలో మంచి మార్గాలను సూచించారు. అమ్లా, బిభితకి, హరితకి అనే మూడు ఫలాల చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు. ఇది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కర్క్యూమిన్ కలిగిన పసుపు ఇన్ఫ్లమేషన్ తగ్గించే యాంటీఆక్సిడెంట్. దీనితో కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. వెల్లుల్లి కొలెస్ట్రాల్ తగ్గించే మరో మంచి మార్గం ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం వల్ల కూడా కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. సమతుల, పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి లేని జీవితం కోసం యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి సాధన చెయ్యడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels