కొన్ని రకాల ఆహారాలు ఫ్రిజ్‌లో పెడితే టాక్సిక్ గా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పొట్టు తీసిన వెల్లుల్లి కొని ఫ్రిజ్ లో పెట్టుకోవద్దు. వీటిలో చాలా త్వరగా ఫంగస్ చేరుతుంది. వెల్లుల్లిని ఫ్రిజ్ లో భద్ర పరచకపోవడమే మంచిది.

వెల్లుల్లిలో పెరిగే ఫంగస్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. కనుక సరిపడినన్ని వెల్లుల్లి రేకల్ని పొట్టు తీసి వాడుకోవాలి.

అంత సమయం లేదనుకుంటే పొట్టుతీసి వెనిగర్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

ఉల్లిపాయలు ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఉల్లిపాయలు చుట్టూ ఉన్న పరిసరాల నుంచి బ్యాక్టీరియాను గ్రహిస్తాయి.

మౌల్డ్ కనిపించినా లేకపోయినా పొట్టుతీసిన లేదా సగానికి కోసిన ఉల్లిపాయను ఉపయోగించకూడదు, ఫ్రిజ్ లో భద్రపరచకూడదు.

ఫ్రిజ్‌లో పెట్టిన అల్లంలో త్వరగా బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ కు కారణం కావచ్చు.

తాజా అల్లం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్రిజ్‌లో చల్లని ఉష్ణోగ్రత వల్ల త్వరగా సూక్ష్మజీవులు పెరుగుతాయి.

వండిన అన్నాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అన్నంలో కూడా వేగంగా సూక్ష్మజీవులు పెరుగుతాయి. వండిన 24 గంటల్లోపే వాడాలి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels