అస్సాం టీలో కాటెచిన్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి. అస్సాం టీ వంటి బ్లాక్ టీని క్రమం తప్పకుంటా తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. అస్సాం టీలో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ మితంగా తీసుకుంటే మానసిక స్థితికి మేలు చేస్తుంది. అస్సాం టీలోని టానిన్లు జీర్ణక్రియకు సహాయపడే ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ , యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. శరీరాన్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఫ్లోరైడ్, టానిన్లు వంటివి టీలో ఉండే సమ్మేళనాలు మెరుగైన నోటి ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఫ్లోరైడ్ దంతక్షయాన్ని నివారించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ టీని నిత్యం తాగితే బరువు నిర్వహణలో సమర్థవంతంగా సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.