ఆకుపచ్చని కూరగాయలు తినేవారి మెదడు చురుకుగా ఉంటుందట. గుండెజబ్బులు, క్యాన్సర్, బీపీ నివారించబడుతాయి.

ఆకుపచ్చని కూరగాయల్లో చాలా పోషకాలు ఉంటాయి. అవేమిటో చూసేయండి.

ఫోలిక్ ఆసిడ్, రైబోఫ్లేవిన్, కాపర్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్, విటమిన్లు ఎ, బి6, సి, కె, పోషకాలతో మెంతి ఆకులు చాలా పౌష్టికమైనవి.

విటమిన్ కె, ఫోలేట్, ఐరన్ కలిగిన మరో ఆకుపచ్చని కాగగూర బెండకాయ. దీనిలోని సహజ సమ్మేళనాలు అనిమియాను నివారిస్తాయి.

యాంటిఆక్సిడెంట్లు కలిగిన క్రూసిఫెరా కు చెందిన బ్రకోలితో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

కొత్తిమిర రక్తంలో షుగర్ తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. గుండె, మెదడు, చర్మం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కరివేపాకులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నిషియం, జింక్, ఫ్లవనాయిడ్స్ వంటి పోషకాలుంటాయి.

విటమిన్ సి, జింక్ కలిగిన మరో ఆకుపచ్చని కూరగాయ సోరకాయ. ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

పాలకూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నివారిస్తాయి.

యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైటిక్ లక్షణాలున్న కాకరకాయతో ఇమ్యూనిటి పెరుగుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels