సాధారణంగా శాకాహారం తీసుకునే వారిని ప్రొటీన్ కొరత వేధిస్తుంటుంది. ఎలాంటి శాకాహారంలో ప్రొటీన్ ఎక్కువుంటుందో తెలుసుకుందాం.

పప్పుధాన్యాల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. మినరల్స్, విటమిన్లు కూడా ఉంటాయి. ఇది ప్రతిరోజు ఆహారంలో పప్పు తీసుకోవాలి.

శనగల్లో వృక్షసంబంధ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. శాఖాహారులు ప్రొటీన్ కోసం శనగల మీద ఆధారపడి ఉండొచ్చు.

చిక్కుళ్లలో ప్రొటీన్ తో పాటు ఫైబర్ కూడా తగినంత ఉంటుంది. ప్రొటీన్ కు పవర్ హౌజ్ గా భావించవచ్చు.

క్వినోవాలో ప్రొటీన్ ఎక్కువ. అంతేకాదు దీనిలో మొత్తం తొమ్మిది ఆవశ్యక అమైనో ఆసిడ్లు ఉంటాయి. వీటిని మన శరీరం తయారు చేసుకోలేదు.

సోయా పాలతో చేసిన పనీర్ టోఫు. ఇందులో చాలినంత ప్రొటీన్ ఉంటుంది. యానిమల్ ప్రొటీన్‌కి మంచి ప్రత్యామ్నాయం.

గ్రీక్ యోగర్ట్ లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. చాలా సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది.

శాఖాహారులకు పనీర్ మంచి ప్రొటీన్ సోర్స్. ఇతర పాల పదార్థాల్లో ఉండే పోషకాలు కూడా ఉంటాయి.

షీయాసీడ్స్‌లో కూడా ప్లాంట్ ప్రొటీన్‌తో పాటు చాలా పోషకాలు ఉంటాయి.

బాదాముల్లో సాచ్యూరేటెడ్ కొవ్వులు తక్కువ. ప్రొటీన్ అధికం. కొలెస్ట్రాల్ ను కూడా అదుపులో ఉంటుంది.

పీనట్ బట్టర్ రుచిగా ఉండడం మాత్రమే కాదు ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ E కూడా ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels