బాల్యం తీసుకున్న బలమైన ఆహారపు ప్రభావం యవ్వనంలోనూ ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.

పాలు, పాల పదార్థాలు ఎదిగే పిల్లలకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి3 వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఎముకలు బలంగా ఎదుగుతాయి.

పండ్లలో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి నిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. రోజూ ఒక పోర్షన్ పండ్లు ఉండాలి.

బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ఫైబర్ కలిపి ఇవ్వాలి. ఇవి పిల్లలకు ఆవశ్యక పోషకాలను అందిస్తాయి.

చికెన్, చేపలు, గుడ్డు, చిక్కుళ్లలో పిల్లలకు అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. ఇది బలమైన కండరాల ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఒమెగా3 ఇతర పోషకాలుండే గింజలు, డ్రైఫ్రూట్స్ పిల్లలకు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేస్తాయి.

పాలకూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో ఐరన్ పుష్కలం. ఇది పిల్లల్లో రక్తహీనత కలగకుండా నిరోధిస్తుంది.

క్యారెట్, క్యాప్సికం, చిలగడదుంపల వంటి కూరగాయల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు పల్లల ఎదుగుదలకు చాలా అవసరం.

పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇవి పిల్లల జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి చాలా అవసరం.



స్ట్రాబెర్రీ, బ్లూబెర్రి, ద్రాక్ష వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ పిల్లలకు అలవాటు చెయ్యాలి. ఇవి వారి మెదడు ఎదుగుదలకు దోహదం చేస్తాయి.

పిల్లలు తగినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉండడం ఆరోగ్యానికి చాలా అవసరం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels