మునగాకుతో మెరిసిపోయే అందం మునగాకులు ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతాయి. మునగాకులో విటమిన్ A, C, E పుష్కలంగా ఉంటాయి. మునగాకు పౌడర్ ను నీళ్లలో కలిపి తాగితే చర్మం మరింత అందంగా తయారవుతుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచి, ముఖంపై ముడతలు రాకుండా కాపాడుతాయి. మునగాకు పేస్టును ముఖంపై రాస్తే ఎలర్జీలు, మొటిమలు లాంటి సమస్యలు రావు. ముఖానికి నేరుగా మునగాకు పేస్టును పూయడం వల్ల డల్ స్కిన్ షైన్ అవుతుంది. మునగాకులోని విటమిన్ C ముఖం మీద నల్ల మచ్చలను, జిడ్డును తొలగించి అందగా కనిపించేలా చేస్తుంది. మునగాకులోని ఫ్యాటీ ఆమ్లాలు పెదాలను మరింత మృదువుగా మార్చుతాయి. Photos Credit: Pixabay.com