హుషారుగా ఉండాలా? ఇవి తింటే హ్యాపీ హార్మోన్స్ పెరుగుతాయి.

డార్క్ చాక్లెట్‌తో శరీరంలో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మంచి మూడ్ కు కారణమయ్యే హార్మోన్లు.

ఎండార్ఫిన్లతో పాటు సెరోటోనిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇది సంతోషంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉండే కొవ్వు కలిగిన సాల్మన్ చేపలు తింటే సెరొటోనిన్, డోపమైన్ పెరుగుతాయి.

సెరొటోనిన్, డోపమైన్ మెదడు ఆరోగ్యానికి, పనితీరు మెరుగ్గా ఉండేందకు చాలా అవసరం.

ప్రొటీన్లు, అమైనో ఆసిడ్లు పుష్కలంగా కలిగిన అరటిపండు తింటే డిప్రెషన్ తొలగి పోయి మూడు బాగుపడుతుంది.

స్ట్రాబెర్రి, బ్లూబెర్రి వంటి బెర్రీల్లో యాంటీఆక్సిడేంట్లు, విటమిన్ సి ఎక్కువ. ఇవి మూడ్ సరిచెయ్యడంలో చాలా ఉపయోగకరం.

సెరొటోనిన్ ఉత్పత్తికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ప్రొబయోటిక్స్.. పెరుగు, ఇతర పులిసిన పదార్థాల్లో లభిస్తాయి.

పాలకూర, బచ్చలికూరల్లో విటమిన్ బి ఉంటుంది. ఇది సెరోటోనిన్ సింథసిస్ కు అవసరం. ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి.

బాదాం, అక్రూట్, పొద్దుతిరుగుడు గింజల వంటివి మెగ్నీషియం, మినరల్స్ తో పాటు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels