ఎర్ర బియ్యం గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే, మీరు దాని వల్ల కలిగే ప్రయోజనాలపై ఓ లుక్ వేయాల్సిందే.

ఈ బియ్యం పైన ఉండే బ్రాన్ లేయర్‌ను తొలగించకపోవడం వల్ల.. ఇవి ఎర్ర రంగులో ఉంటాయి.

ఇలా పొట్టుతో ఉండడం వల్ల విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలన్నీ నిలిచి ఉంటాయి.

ఈ బియ్యంలో చక్కని డైటరీ ఫైబర్ ఉంటుంది. అందువల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. కడుపు నిండినట్లు ఉంటుంది.

ఈ బియ్యపు గ్లైసిమిక్ ఇండెక్స్ తెల్ల బియ్యం కంటే చాలా తక్కువ. అందువల్ల మధుమేహులకు మంచి ఆహారం.

ఆంథోసియానిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్ల వల్ల ఈ బియ్యం ఎర్రగా ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గిస్తాయి.

ఇందులోని ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

కడుపు నిండుగా ఉన్న భావన కలిగించి ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి సులభంగా బరువు తగ్గొచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels