కొన్ని ప్రత్యేక ఆరోగ్యకరమైన అలవాట్లు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు దోహదం చేస్తాయి.

ఉదయాన్నే పోషకాలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. ఇది రోజంతా కొలెస్ట్రాల్ స్థాయిల మీద ప్రభావం చూపుతుంది.

తీసుకునే ఆహారంలో గుడ్డులోని తెల్లసొన, అవకాడో వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవాలి.

నీళ్లు తగినన్ని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.

వేపుడు పదార్థాలు తీసుకుంటే ఎల్డీఎల్ పెరుగుతుంది. కనుక వీటికి పూర్తిగా దూరంగా ఉండాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఉపయోగకరం.

ఆహారానికి ఆరోగ్యకరమైన కొవ్వులు చేర్చుకోవాలి. అందుకు గింజలు, ఆలీవ్ ఆయిల్ వంటివి తీసుకోవాలి.

అన్ని రకాల పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels