ఇలా చేస్తే మీ మెదడుకు ముప్పు తప్పదు! మెదడు ఎంత యాక్టివ్ గా ఉంటే మనిషికి అంత మంచిది. కొన్ని అలవాట్లు మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. గంటల తరబడి కూర్చోని పని చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. సరిపడ నిద్ర లేకపోవడం వల్ల మెదడు పనితీరు మొద్దుబారి జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఎక్కువ సేపు టీవీ, ఫోన్లు చూడటం వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి. సరిపడ మంచి నీళ్లు తాగకపోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల మెదడు పై ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కువ సౌండ్ తో పాటలు వినడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. All Photos Credit: pexels.com