కలబంద రసాన్ని కలబంద గుజ్జు ఉపయోగించి చేస్తారు. ఇది జుట్టుకి, చర్మానికి ఇతర అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి.

జీవక్రియలను వేగవంతం చేయ్యడానికి కలబంద బాగా ఉపయోగపడుతుందని అధ్యనాలు చెబుతున్నాయి.

కలబంద రసం తీసుకున్నపుడు రోజంతా ఖర్చుచేసే క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా బరువు సులభంగా తగ్గుతుంది.

కలబంద రసం రక్తంలో షుగర్ స్థాయి తగ్గిస్తుంది. డయాబెటిక్స్‌కు ఇది చాలా మేలు చేస్తుంది.

కలబంద సహజమైన విరేచనకారి. కనుక కలబంద రసం తీసుకున్నపుడు పెద్ద పేగు శుభ్రపడి బరువు పెరగకుండా నిరోధిస్తుంది.

దీనిలో డైయూరేటిక్ లక్షణాలు శరీరంలో అదనంగా చేరిన ఉప్పు, నీటిని బయటికి పంపి శరీరంలో నీరు చేరకుండా నియంత్రిస్తుంది.

కలబందలో విటమిన్ బి చాలా ఎక్కువ. శరీరంలో కొవ్వును త్వరగా కరిగిస్తుంది.

కలబంద రసంలో యాంటీఆక్సిడెంట్లు, పాలీసాకరైడ్లు ఉంటాయి. కనుక శరీరంలోని వ్యర్థాలను సమర్థవంతంగా బయటికి పంపుతుంది.

అయితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. విరేచనాలు, కడుపు నొప్పి వంటి జీర్ణసంబంధ సమస్యలు రావచ్చు.

ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఖనిజలవణాలు తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels